అదనపు ఎస్పీ తీరుపై జర్నలిస్టుల నిరసన.. స‌ముదాయించిన క‌లెక్ట‌ర్‌

విధాత, నిజామాబాద్: కామారెడ్డి అదనపు ఎస్పీ అన్యోన్య వైఖరికి నిరసనగా శనివారం కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కలెక్టర్ మీడియా సమావేశం ఏర్పాటు చేయగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో వారిని ప్రధాన గేట్ వద్ద అదనపు ఎస్పీ ఆపి లోనికి అనుమతించ లేదు. తమను ప్రెస్ మీట్ కు పిలిచి అవమానపరిచారని జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. దీంతో కలెక్టర్ జితేష్ వి పాటిల్ […]

అదనపు ఎస్పీ తీరుపై జర్నలిస్టుల నిరసన.. స‌ముదాయించిన క‌లెక్ట‌ర్‌

విధాత, నిజామాబాద్: కామారెడ్డి అదనపు ఎస్పీ అన్యోన్య వైఖరికి నిరసనగా శనివారం కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కలెక్టర్ మీడియా సమావేశం ఏర్పాటు చేయగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు.

దీంతో వారిని ప్రధాన గేట్ వద్ద అదనపు ఎస్పీ ఆపి లోనికి అనుమతించ లేదు. తమను ప్రెస్ మీట్ కు పిలిచి అవమానపరిచారని జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. దీంతో కలెక్టర్ జితేష్ వి పాటిల్ స్వయంగా వచ్చి జర్నలిస్ట్ లను సముదాయించి లోనికి రావాల్సిందిగా కోరారు.

అన్యోన్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో వెళ్లి పోయిన కలెక్టర్ మరోసారి బయటకు వచ్చి జరిగిన దానికి చింతిస్తున్నట్లు చెప్పారు. తర్వాత మీడియా సమావేశానికి జర్నలిస్టులు హాజరయ్యారు.