రైతుబంధు ఆగింది కాంగ్రెస్ వల్ల కాదన్న కేకే
రైతుబంధు నగదు పంపిణీకి అనుమతించాలని కోరుతూ తెలంగాణ బీఆరెస్ ప్రభుత్వం మరోసారి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది

రైతుబంధు పంపిణీ ఆగిపోవడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని ముఖ్యమంత్రి మొదలు.. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు వంటివారు చెబుతుంటే.. బీఆరెస్ సెక్రటరీ జనరల్ కే కేశవరావు మాత్రం భిన్నస్వరం వినిపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రైతుబంధు ఆగిపోవడం వెనక కాంగ్రెస్ పార్టీ ప్రమేయం లేదని కేకే చెప్పారు. ఆ పార్టీ వల్లనే అగిపోయిందని తాను అనడంలేదని వ్యాఖ్యానించారు. కేకే వ్యాఖ్యలు కాంగ్రెస్ వల్లనే రైతుబంధు ఆగిందన్న సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవితల వ్యాఖ్యలకు భిన్నంగా ఉండటం చర్చనీయాంశంమైంది.