తెలంగాణలో టీడీపీ అన్ని స్థానాల్లో పోటీ: కాసాని

విధాత: తెలుగు దేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాలలో పోటీ చేస్తుందని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఙానేశ్వర్ తెలిపారు. బీజేపీతో పొత్తుల విషయంలో ఎలాంటి స్పష్టత లేదన్నారు. ఆదివారం ఉదయం ఈ అంశాలపై లోకేష్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తెలంగాణలో టీడీపీ బలంగానే ఉందన్నారు. తనకు ఏ పార్టీ నుంచి పిలుపు రాలేదని చెప్పిన ఆయన తన దృష్టిలో టీడీపీ మాత్రమే మంచిదన్నారు.