ఇది అంతం కాదు.. ఆరంభం : కేసీఆర్
విధాత: వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై యుద్ధానికి శ్రీకారం చుట్టామని టీఆర్ఎస్స్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. ఇది అంతం కాదని.. ఆరంభం మాత్రమేనని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద చేపట్టిన మహా ధర్నాలో కేసీఆర్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ అస్పష్ట విధానాలతో తెలంగాణ రైతులు నష్టపోతున్నారని ఆరోపించారు. రైతులకు ప్రయోజనాలు చేకూరే వరకు ఆందోళనలు కొనసా గిస్తామనిమని కేసీఆర్ స్పష్టం చేశారు. ఉత్తరాది రైతులతో […]

విధాత: వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై యుద్ధానికి శ్రీకారం చుట్టామని టీఆర్ఎస్స్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. ఇది అంతం కాదని.. ఆరంభం మాత్రమేనని చెప్పారు.
ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద చేపట్టిన మహా ధర్నాలో కేసీఆర్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ అస్పష్ట విధానాలతో తెలంగాణ రైతులు నష్టపోతున్నారని ఆరోపించారు.
రైతులకు ప్రయోజనాలు చేకూరే వరకు ఆందోళనలు కొనసా గిస్తామనిమని కేసీఆర్ స్పష్టం చేశారు. ఉత్తరాది రైతులతో కలిసి కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతామన్నారు. రైతుల సమస్యలపై నిన్ననే ప్రధాని మోదీకి లేఖ రాశానని చెప్పారు.
వివిధ పోరాటాల మార్గాన్ని ఎంచుకుని నిరసన కొనసాగిస్తామని సీఎం తెలిపారు. తమ మహాధర్నాలో నీతి, నిజాయితీ ఉన్నాయని.. అందుకే చిరుజల్లులు కూడా స్వాగతం పలికాయన్నారు.
సీఎంగా ఉన్నప్పుడు మోదీ ధర్నా చేయలేదా?
‘‘దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని, ధాన్యం కొనుగోలులో కేంద్రం వైఖరితో రైతులకు తీవ్ర నష్టం జరుగు తోందని వివిధ పోరాటాల మార్గాన్ని ఎంచుకుని ఆందోళనలు కొనసాగిస్తామని సీఎం కేసీఆర్కేం స్పష్టం చేశారు. కేంద్రం కళ్లు తెరిపించడానికే యుద్ధానికి శ్రీకారం చుట్టామన్నారు.
దేశాన్ని పాలిస్తున్న నాయకులు వితండవాదాలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న వారు ధర్నా ఎలా చేస్తారని భాజపా నేతలు అంటున్నారు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోదీ ధర్నా చేయలేదా? దేశంలో సీఎం, మంత్రులు కూడా ధర్నాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఈ పోరాటం ఇక్కడితో ఆగదని ఇంకా చాలా పోరాటాలు చేయాలని అవసరమైతే దిల్లీ యాత్ర చేయాల్సి ఉంటుందని కేంద్రం సమస్యను పరిష్కరిస్తే ధర్నాల అవసరం ఉండదు’’ అని కేసీఆర్ అన్నారు.