ఎర్రవెల్లిలో కేసీఆర్ తో భేటీయైన హరీష్ రావు

ఎర్రవెల్లిలో కేసీఆర్ తో కేటీఆర్, హరీష్ రావు, కీలక నేతల భేటీ జరిగింది. కవిత ఆరోపణలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చ ప్రాధాన్యం సంతరించుకుంది.

ఎర్రవెల్లిలో కేసీఆర్ తో భేటీయైన హరీష్ రావు

విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్(BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) తో ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్(Erravelli Farmhouse) లో కేటీఆర్, హరీష్ రావు సహా ముఖ్య నాయకులు భేటీ అయ్యారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ, కవిత(Kavitha) తాజాగా హరీష్ రావు(Harish Rao), సంతోష్ రావుల(Santosh Rao)పైన చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. విదేశీ పర్యటనను ముగించుకుని వచ్చిన హరీష్ రావు ఫామ్ హౌస్ కు చేరుకుని కేసీఆర్ తో సమావేశంలో పాల్గొన్నారు.

మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, శంబిపూర్ రాజు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి జి.జగదీష్ రెడ్డి సహా పార్టీ ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరైనట్లుగా సమాచారం. కవిత ఎపిసోడ్ తో పాటు తాజా రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో వారంతా సుదర్ఘంగా చర్చిస్తున్నారు.