ఖేల్ ఇండియా ఉమెన్స్ క్రీడాకారులను సన్మానించిన కలెక్టర్ పమేలా
విధాత, యాదాద్రి భువనగిరి: ఖేలో ఇండియా ఉమెన్స్ జూడో నేషనల్ లీగ్ ర్యాంకింగ్ టోర్నమెంట్, సౌత్ జోన్, త్రిస్సూర్, కేరళలో ఈ నెల 1 నుంచి 5వ తేది వరకు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర టీంలో యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి 6 గురు సబ్ జూనియర్ అండర్ 57 కేజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి శుక్రవారంవారిని ఘనంగా సన్మానించి మాట్లాడుతూ భవిషత్తులో చదువుతో పాటు ఆటలపై కూడా శ్రద్ద చూపాలని […]

విధాత, యాదాద్రి భువనగిరి: ఖేలో ఇండియా ఉమెన్స్ జూడో నేషనల్ లీగ్ ర్యాంకింగ్ టోర్నమెంట్, సౌత్ జోన్, త్రిస్సూర్, కేరళలో ఈ నెల 1 నుంచి 5వ తేది వరకు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర టీంలో యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి 6 గురు సబ్ జూనియర్ అండర్ 57 కేజీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి శుక్రవారంవారిని ఘనంగా సన్మానించి మాట్లాడుతూ భవిషత్తులో చదువుతో పాటు ఆటలపై కూడా శ్రద్ద చూపాలని కోరారు. జాతీయ అంతర్జాతీయ పోటీలలో గెలుపొందాలని కోరారు.
అనంతరం జిల్లా యువజన క్రీడల అధికారి ధనుంజనేయులు మాట్లాడుతూ విద్యార్ధుల తల్లిదండ్రులు వారి పిల్లలను అవుట్ డోర్ గేమ్‌లకు తమ పిల్లలను పంపించాలని వారు కోరారు. కార్యక్రమంలో డీఈ బ్రంహం, డైరెక్టర్ కరస్పాండెంట్, సాయి మోహిత్ మెమోరియల్ హైస్కూల్, వెంకిర్యాల, బీబీనగర్ బి.ప్రవీణ్ కుమార్, జి.మురళి, జయ పాల్గొన్నారు.
కార్యక్రమంలో క్రీడాకారిణలు యం.శ్రీనిజ, 9వ తరగతి, జి.సుష్మ, 8వ తరగతి, యం.వెన్నెల, 9వ తరగతి, ఎస్.శ్రావని, 8వ తరగతి, వీ.వైష్ణవి, 8వ తరగతి, పి.తేజస్విని, 9వ తరగతి, సాయి మోహిత్ మెమోరియల్ హైస్కూల్, వెంకిర్యాల బీబీనగర్ కోచ్ పర్వేజ్ పాల్గొన్నారు.