ఎడ్లబండి తోలిన MLA ఆరూరి.. కొత్తకొండ జాతరకు తరలిన భక్తులు
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కొత్తకొండ జాతరకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి వీరభద్రస్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు. జాతరలో భాగంగా ఆదివారం రోజున వీర భద్ర స్వామి జాతరకు కట్టిన ఎడ్ల బండిని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కొద్ది దూరం తోలి భక్తులను ఆనందపరిచారు. దేవన్నపేట గ్రామానికి చెందిన భక్తులు భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో జరుగుతున్న శ్రీ వీర భద్ర స్వామి జాతరకు ఎడ్ల బండ్లపై బయలుదేరుతున్న తరుణంలో భక్తులతో బీఆర్ఎస్ వరంగల్ జిల్లా […]

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కొత్తకొండ జాతరకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి వీరభద్రస్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు. జాతరలో భాగంగా ఆదివారం రోజున వీర భద్ర స్వామి జాతరకు కట్టిన ఎడ్ల బండిని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కొద్ది దూరం తోలి భక్తులను ఆనందపరిచారు.
దేవన్నపేట గ్రామానికి చెందిన భక్తులు భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో జరుగుతున్న శ్రీ వీర భద్ర స్వామి జాతరకు ఎడ్ల బండ్లపై బయలుదేరుతున్న తరుణంలో భక్తులతో బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే ముచ్చటించారు.
ఈ సందర్భంగా స్వయంగా ఎడ్ల బండిని నడిపారు. సంతోషంంగా జాతరకు వెళ్లిరావాలని ఆకాంక్షించారు. తాను తన స్వగ్రామంలో ఉన్పప్పుడు ఎడ్లబండి తోలినట్లు గుర్తు చేసుకున్నారు.