రాఖీ కి దూరం అయిన అన్నలు కేటీఆర్, జగన్.. బంధం తెగిందా..?

రాఖీ పర్వదినం సందర్భంగా రాజకీయ పార్టీ నాయకుల ఇళ్లలో సందడి నెలకొంది. కానీ, రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు పార్టీలకు చెందిన ప్రధాన నాయకులు రాఖీ పండుగకు దూరంగా ఉన్నారు.

రాఖీ కి దూరం అయిన అన్నలు కేటీఆర్, జగన్.. బంధం తెగిందా..?

విధాత, హైదరాబాద్ : రాఖీ పర్వదినం సందర్భంగా రాజకీయ పార్టీ నాయకుల ఇళ్లలో సందడి నెలకొంది. కానీ, రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు పార్టీలకు చెందిన ప్రధాన నాయకులు రాఖీ పండుగకు దూరంగా ఉన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ లో లేనందున ఆయన సోదరి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈసారి ఆయనకు రాఖీ కట్టలేదు.

మరోవైపు మాజీ సీఎం వైఎస్ జగన్ కు, ఆయన సోదరి వైఎస్ షర్మిల మధ్య కూడా గ్యాప్ ఉంది. దీంతో జగన్ కు షర్మిల రాఖీ కట్టలేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయన సోదరి కవిత మధ్య గ్యాప్ ఉందని ప్రచారం సాగుతోంది. ఇటీవల పార్టీలో జరుగుతున్నపరిణామాలు ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకొని రాఖీ కట్టేందుకు వస్తానని కేటీఆర్ కు కవిత మేసేజ్ పెట్టారని చెబుతున్నారు. అయితే పార్టీ కార్యక్రమంలో భాగంగా న్యూఢిల్లీ వెళ్లినట్టుగా ప్రచారం సాగుతోంది. అయితే తాను హైదరాబాద్ లో లేనని ఔట్ ఆఫ్ స్టేషన్ అంటూ కవితకు కేటీఆర్ రిప్లై ఇచ్చారని సమాచారం. గత ఏడాది కవిత తీహార్ జైల్లో ఉన్నారు. లిక్కర్ కేసులో అరెస్టై జైల్లో ఉన్నందున ఆమె కేటీఆర్ కు రాఖీ కట్టలేదు. ఈ విషయాన్ని అప్పట్లో కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ ఏడాది కవిత హైదరాబాద్ లోనే ఉన్నా కేటీఆర్ న్యూఢిల్లీకి వెళ్లినట్టుగా చెబుతున్నారు. ఇక ఏపీ మాజీ సీఎం, వైఎస్ఆర్ సీపీ చీఫ్ వైఎస్ జగన్ కు ఆయన సోదరి వైఎస్ షర్మిల రాఖీ కట్టేవారు. అయితే వీరిద్దరి మధ్య ఇటీవల కాలంలో గ్యాప్ పెరిగింది.

ఏపీలో అధికారానికి దూరమైన తర్వాత జగన్ ఎక్కువగా బెంగుళూరులో ఉంటున్నారు. పార్టీ సమావేశాల కోసం అమరావతికి వస్తున్నారు. ఆ తర్వాత బెంగుళూరుకు వెళ్తున్నారు. జగన్ కు, షర్మిలకు సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నందున షర్మిల కూడా జగన్ కు రాఖీ కట్టలేదనే ప్రచారం సాగుతోంది.