న్యాయవాది పృథి రాజ్,సంపత్ లను విడుదల చేయాలి…పౌర హక్కుల సంఘం
విధాత:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు కు చెందిన అడ్వకేట్,అంకాల పృథ్వీరాజ్ మరియు అంబేద్కర్ పూలే సంఘం,హైదరాబాద్ కు చెందిన సంపత్ అనే కార్యకర్తను తెలంగాణ రాష్ట్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల వద్ద పోలీసులు 29,ఆగస్ట్ 2021 ఆదివారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నారని,సాయంత్రం 6 గంటల సమయంలో ప్రెస్ మీట్ ద్వారా ప్రకటిస్తామని చెప్పినారని స్థానిక న్యాయవాదులు పౌర హక్కుల సంఘానికి తెలిపినారు.ఈ రోజు సోమవారం,30 ఆగస్ట్ 2021 రాత్రి 9:30గంటలవరకు కూడా పోలీసులు వారిద్దరిని తమ అదుపులో […]

విధాత:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు కు చెందిన అడ్వకేట్,అంకాల పృథ్వీరాజ్ మరియు అంబేద్కర్ పూలే సంఘం,హైదరాబాద్ కు చెందిన సంపత్ అనే కార్యకర్తను తెలంగాణ రాష్ట్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల వద్ద పోలీసులు 29,ఆగస్ట్ 2021 ఆదివారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నారని,సాయంత్రం 6 గంటల సమయంలో ప్రెస్ మీట్ ద్వారా ప్రకటిస్తామని చెప్పినారని స్థానిక న్యాయవాదులు పౌర హక్కుల సంఘానికి తెలిపినారు.ఈ రోజు సోమవారం,30 ఆగస్ట్ 2021 రాత్రి 9:30గంటలవరకు కూడా పోలీసులు వారిద్దరిని తమ అదుపులో ఉన్నట్లుగా ప్రకటించలేదు మరియు మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచ లేదు.
ప్రజాస్వామిక వ్యవస్థలో పోలీసులే కిడ్నాప్ చేసినట్లుగా ప్రజలు భావిస్తున్నారు.ఇది ముఖ్యమంత్రి KCR అప్రజాస్వామిక పాలనకు మరియు రాజ్యాంగ వ్యతికరేక వైఖరికి నిదర్శనం ఈ పోలీస్ కిడ్నాప్ లు.ఇప్పటికైన వారిద్దరిని విడుదల చేయాలని లేదా మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది….
1.N. నారాయణ రావు, ప్రధాన కార్యదర్శి,పౌర హక్కుల సంఘం తెలంగాణ.
2.చిలుకా చంద్రశేఖర్,ప్రధాన కార్యదర్శి,పౌర హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్.