తెలంగాణలో లాక్‌డౌన్
తెలంగాణలో లాక్‌డౌన్ ( Telangana ) విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి పదిరోజుల పాటు ఈ లాక్‌డౌన్ కొనసాగనుంది. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రం లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. నిత్యవసరాలు, ఇతర వస్తువుల కొనుగోలుకు ఈ సమయంలో వెసులుబాటు కల్పించారు. ఉదయం 10 గంటల తర్వాత మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్ అమలు కానుంది. ఈ సమయంలో దాదాపు అన్ని […]

తెలంగాణలో లాక్‌డౌన్ ( Telangana ) విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి పదిరోజుల పాటు ఈ లాక్‌డౌన్ కొనసాగనుంది. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రం లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. నిత్యవసరాలు, ఇతర వస్తువుల కొనుగోలుకు ఈ సమయంలో వెసులుబాటు కల్పించారు.
ఉదయం 10 గంటల తర్వాత మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్ అమలు కానుంది. ఈ సమయంలో దాదాపు అన్ని కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. అత్యవసర సేవలను మాత్రమే అనుమతించనున్నారు. అలాగే వ్యాక్సిన్ ( corona vaccine ) కొరత నివారించేందుకు టీకా కొనుగోలుకు గ్లోబర్ టెండర్లను పిలవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.