మహేశ్ బ్యాంకు కుంభకోణాలు..అనర్హులకు 300కోట్ల రుణాలు
మహేశ్ బ్యాంకు కుంభకోణంపై విచారణ జరుపుతున్న ఈడీ కీలక ఆధారాలను సేకరించింది. 300 కోట్ల మేరకు రుణాలను అనర్హులకు ఇచ్చినట్లుగా, 1800 మందికి డమ్మీ గోల్డ్ లోన్స్ ఇచ్చినట్లు ఈడీ గుర్తించింది.

విధాత, హైదరాబాద్ : మహేశ్ బ్యాంకు కుంభకోణంపై విచారణ జరుపుతున్న ఈడీ కీలక ఆధారాలను సేకరించింది. 300 కోట్ల మేరకు రుణాలను అనర్హులకు ఇచ్చినట్లుగా, 1800 మందికి డమ్మీ గోల్డ్ లోన్స్ ఇచ్చినట్లు ఈడీ గుర్తించింది. పంట రుణాలకు తక్కువ వడ్డీ వసూలు చేసినట్లుగా ఈడీ గుర్తించింది. బీనామీ పేర్లుతో కుటుంబ సభ్యులే రుణాలు తీసుకున్నారని, బ్యాంకు డబ్బును వివిధ మార్గాల ద్వారా పక్కదారి పట్టి్ంచారని, తపుల్పడు ఆస్తి పత్రాలతో భారీగా రుణాలు మంజూరీ చేఆశారని ఈడీ విచారణలో వెల్లడైంది. అలాగే వక్ప్ బోర్డు ఆస్తులకు కూడా రుణాలు ఇచ్చినట్లుగా గుర్తించారు. విచారణలో కోటి రూపాయల నగదుతో పాటు ఐదు కోట్ల ఆభరణాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.