సమావేశమైన కొవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ
హైదరాబాద్: తెలంగాణలో బుధవారం ఉదయం 10 గంటల నుంచి లాక్‌డౌన్ అమల్లోకి వచ్చిన విషయం విదితమే.లాక్‌డౌన్‌కు తెలంగాణ ప్రజలు పూర్తిగా సహకరిస్తున్నారు. కరోనా పరిస్థితులపై చర్చించేందుకు మంత్రి కేటీఆర్ అధ్యక్షతన కొవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం మంత్రి కేటీఆర్ అధ్యక్షతన తాత్కాలిక సచివాలయ భవనంలోని సీఎస్ కార్యాలయంలో కొవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశమైంది. ఏ రోజుకారోజు మందులు, వ్యాక్సిన్లను వేగవంతంగా సమకూర్చి, సరఫరా చేయడం కోసం మంత్రి […]

హైదరాబాద్: తెలంగాణలో బుధవారం ఉదయం 10 గంటల నుంచి లాక్‌డౌన్ అమల్లోకి వచ్చిన విషయం విదితమే.లాక్‌డౌన్‌కు తెలంగాణ ప్రజలు పూర్తిగా సహకరిస్తున్నారు. కరోనా పరిస్థితులపై చర్చించేందుకు మంత్రి కేటీఆర్ అధ్యక్షతన కొవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం మంత్రి కేటీఆర్ అధ్యక్షతన తాత్కాలిక సచివాలయ భవనంలోని సీఎస్ కార్యాలయంలో కొవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశమైంది. ఏ రోజుకారోజు మందులు, వ్యాక్సిన్లను వేగవంతంగా సమకూర్చి, సరఫరా చేయడం కోసం మంత్రి కేటీఆర్ అధ్యక్షతన రాష్ట్రస్థాయి టాస్క్ ఫోర్స్ నియామకానికి క్యాబినెట్ నిన్న ఆమోదం తెలిపింది.
పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, సీఎంఓ నుండి సీఎం కార్యదర్శి, కోవిడ్ ప్రత్యేకాధికారి రాజశేఖర్ రెడ్డి ఈ టాస్క్ ఫోర్స్ లో సభ్యులుగా కొనసాగుతున్నారు.