బీఆర్‌ఎస్‌ పాలనలో గడప గడపకూ సంక్షేమం: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

బీఆర్‌ఎస్‌ పాలనలో గడప గడపకూ సంక్షేమం అందిందని, కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని నిర్మ‌ల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్య‌ర్థి, మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు.

బీఆర్‌ఎస్‌ పాలనలో గడప గడపకూ సంక్షేమం: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: బీఆర్‌ఎస్‌ పాలనలో గడప గడపకూ సంక్షేమం అందిందని, కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని నిర్మ‌ల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్య‌ర్థి, మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలో ఎన్నికల ప్రచారం చేశారు. చింతకుంట వాడ, పాత బస్టాండ్, పింజరి గుట్టలో ఇంటింటా ప్రభుత్వ పథకాలు వివరించారు,


బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను తెలియజేస్తూ ప్రచారం కొనసాగించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీల అభివృద్ధి బాధ్యత తనదని, మీరు భరోసాగా ఉండాలన్నారు. మూడోసారి ఆశీర్వ‌దించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే, నిర్మ‌ల్ మ‌రింత అభివృద్ధి చేస్తాన‌ని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ నాయ‌కుల మోస‌పూరిత మాట‌లు నమ్మవ‌ద్ద‌ని కోరారు.