పేద ప్రజల సొంత ఇంటి కల నెరవేర్చిన ఘనత కేసీఆర్ దే..మంత్రి మహమూద్ అలీ

విధాత:పేద ప్రజల సొంత ఇంటి కల నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కే దక్కుతుందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. గురువారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్ పేట డివిజన్ GYR కాంపౌండ్ లో 15.57 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 180 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను హోం మంత్రి మహమూద్ అలీ, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ […]

పేద ప్రజల సొంత ఇంటి కల నెరవేర్చిన ఘనత కేసీఆర్ దే..మంత్రి మహమూద్ అలీ

విధాత:పేద ప్రజల సొంత ఇంటి కల నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కే దక్కుతుందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. గురువారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్ పేట డివిజన్ GYR కాంపౌండ్ లో 15.57 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 180 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను హోం మంత్రి మహమూద్ అలీ, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, స్థానిక కార్పొరేటర్ హేమలత లతో కలిసి ప్రారంభించారు.

ముందుగా కాలనీ ఆవరణ లో నూతనంగా నిర్మించనున్న దేవాలయ నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించారు. అనంతరం మంత్రి తలసాని యాదవ్ అద్యక్షతన జరిగిన సభలో హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు పేదలకు నామ మాత్రపు ఆర్ధిక సహాయంతో ఇరుకైన ఇండ్లను నిర్మించి ఇచ్చారని పేర్కొన్నారు.తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి KCR పేదప్రజల పై ఒక్క పైసా ఆర్ధిక భారం పడకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా పూర్తిగా ప్రభుత్వమే ఖర్చు భరించి విశాలమైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇస్తుందని వివరించారు. అంతేకాకుండా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ క్రింద పేదింటి ఆడపడుచుల వివాహానికి లక్ష 116 రూపాయల ఆర్ధిక సహాయం అందిస్తున్నారని అన్నారు.

అన్ని విధాలుగా పేదప్రజలకు అండగా ఉంటూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి ఎంతో కృషి చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ప్రశంసించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పేదలు ఎంతో గొప్పగా బ్రతకాలనేది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆశయమని అన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనల తోనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని తెలంగాణా ప్రభుత్వం చేపట్టిందని, అందులో భాగంగానే మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పర్యవేక్షణలో మురికివాడల స్థానంలో అన్ని వసతులతో విశాలమైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించడం జరిగిందని అన్నారు. ఇండ్లను లబ్దిదారులకు అందరి సమక్షంలో లాటరీ పద్దతిలో పంపిణీ చేయడం జరుగుతుందని వివరించారు. GYR కాంపౌండ్ పక్కనే నివసిస్తున్న నిరుపేద ముస్లీం లకు కూడా 5 నెలల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇస్తామని మంత్రి శ్రీనివాస్ యాదవ్ సభలో ప్రకటించారు.

ఆషాడ బోనాలకు ముందే GYR కాంపౌండ్ లో పండుగ వాతావరణం నెలకొందని అన్నారు. నిర్వహణ కోసం 6 షాప్ లను నిర్మించడం జరిగిందని, వాటి ద్వారా వచ్చే అద్దె లతో లిఫ్ట్ నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత వంటి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మహేశ్వరి, RDO వసంత కుమారి, తహసిల్దార్ జానకి, DMC ముకుంద రెడ్డి, EE శివానంద్, హౌసింగ్ CE కిషన్, EE వెంకటదాసు రెడ్డి, వాటర్ వర్క్స్ GM రమణారెడ్డి, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ TRS ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, మాజీ కార్పొరేటర్ లు నామన శేషుకుమారి, ఆకుల రూప, ఉప్పల తరుణి తదితరులు పాల్గొన్నారు.