Ponnam Prabhakar Counter To KTR : చెల్లికి న్యాయం చేయనివాడు జూబ్లిహిల్స్‌కు ఏం చేస్తాడు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం కౌంటర్.. "చెల్లికి న్యాయం చేయలేని వాడు నియోజకవర్గానికి ఏం చేస్తాడు" అన్నారు.

Ponnam Prabhakar Counter To KTR : చెల్లికి న్యాయం చేయనివాడు జూబ్లిహిల్స్‌కు ఏం చేస్తాడు

హైదరాబాద్, సెప్టెంబర్10(విధాత): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ఇండ్ల కూల‌గొట్టుడు గురించి కేటీఆర్ మాట్లాడ‌టం విడ్డూరమన్నారు. ఇదే జూబ్లిహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలో చిన్న శ్రీశైలం యాద‌వ్ ఇంటిని కేటీఆర్ కూల‌గొట్టియ్య లేదా, ప‌దేండ్లు పాలించి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఒక్క ఇల్లు అన్నా క‌ట్టించారా అని ప్రశ్నించారు.

ఎన్నిక‌లు, ఉప ఎన్నిక‌లంటే బీరు బిర్యాణి క‌ల్చ‌ర్ తెచ్చింది కేటీఆర్ అని ఆరోపించారు. హుజురాబాద్, దుబ్బాక, మునుగోడులో కోట్ల డ‌బ్బులు, లిక్క‌ర్ సిసాలు పంచిది టీఆర్ఎస్ అని విమర్శించారు. ప‌ద్దెనిమిదేళ్లు నిండితే చాలు.. ఎన్నిక‌ల్లో నిర్బంధ మ‌ద్యం విదానాన్ని అమ‌లు చేసింది విల్లేనని మండిపడ్డారు. జుబ్లిహిల్స్‌లో బీఆర్ఎస్ గెలిస్తే లాభం లేదు. ప్ర‌భుత్వం మార‌దు. కాంగ్రెస్‌ను ఆశిర్వ‌దిస్తే ఇక్క‌డ అభివృద్ది జాత‌ర‌ జరుగుతుందన్నారు.

ఎన్నిక‌లొస్తేనే కేటీఆర్ వ‌స్తాడు. కానీ మీకు ఏ అవ‌స‌రం వచ్చినా మేము అందుబాటులో ఉన్నామని తెలిపారు. కూట్లో రాయిని తీయ‌ని వాడు, ఏట్లో రాయిని తీస్తాడా..? సొంత చెల్లికి న్యాయం చేయ‌లేనోడు జూబ్లిహిల్స్‌కు ఏమి చేస్తాడని ప్రశ్నించారు. గోపినాథ్ మీద ప్రేమ ఉంటే మంత్రి ప‌ద‌వి ఎందుకు ఇవ్వ‌లేదని మంత్రి పొన్నం ప్రశ్నించారు.