Ponnam Prabhakar | రైతులతో ముచ్చటించిన మంత్రి పొన్నం ప్రభాకర్..రుణమాఫీ అమలుపై రైతులతో ముచ్చట
రుణమాఫీ పథకంపై రైతుల మనోగతాన్ని తెలుసుకునే క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ వరినాట్ల పనుల్లో ఉన్న రైతులను కలిసి వారితో ముచ్చటించారు.

విధాత, హైదరాబాద్ : రుణమాఫీ పథకంపై రైతుల మనోగతాన్ని తెలుసుకునే క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ వరినాట్ల పనుల్లో ఉన్న రైతులను కలిసి వారితో ముచ్చటించారు. హుస్నాబాద్ నియోజకవర్గం చిగురు మామిడి మండలంలోని చిన్న ములకనూరు వెళ్తుండగా దారిలో వరి నాట్లు వేస్తున్న రైతుల వద్దకు మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్లారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ చేసిందని ఇప్పటికే లక్ష ,లక్ష 50 వేల లోపు ఉన్న వారికి రుణమాఫీ పూర్తయిందని వారికి వెల్లడించారు. రుణమాఫీ పట్ల వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఎవరైనా రైతు రుణమాఫీ కానీ రైతులుంటే వారు మండల వ్యవసాయధికారిని కలిసి వివరాలు ఇవ్వాలని రైతులకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, రైతుల కోసం కాంగ్రెస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, చేయనున్న కార్యక్రమాలను ఈ సందర్భంగా మంత్రి వారికి వివరించారు.