అభివృద్ధికి పట్టం కట్టండి: మంత్రి శ్రీనివాస్ గౌడ్

పాలమూరు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేసే దిశగా ప్రజలు ఆలోచించాలని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు

అభివృద్ధికి పట్టం కట్టండి: మంత్రి శ్రీనివాస్ గౌడ్
  • కాంగ్రెస్ వస్తే అన్ని కుటుంబాల్లో చీకట్లే
  • వెలుగులు రావాలంటే కారు గుర్తుకు ఓటేయాలి
  • పాలమూరు బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి శ్రీనివాస్ గౌడ్


విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: పాలమూరు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేసే దిశగా ప్రజలు ఆలోచించాలని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం నియోజకవర్గంలోని హన్వాడ మండలంలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా పలు గ్రామాల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 75 ఏళ్లలో జరగని అభివృద్ధి పదేళ్లలో జరిగిందని,మళ్ళీ బీఆర్ఎస్ ను గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు.


అభివృద్ధికి మారుపేరైన అధికార బీఆర్ఎస్ కు మరోసారి భారీ మెజారిటీతో పట్టం కట్టాలని మంత్రి కోరారు.కొందరు నాయకులు మాయమాటలు చెప్పి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తారని, ఎన్నికలు పూర్తి కాగానే కనపడకుండా వెళతారని, అలాంటి వారిని నమ్మి మోసపోవద్దని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ లేక గ్రామాలన్నీ చీకట్లో మగ్గడం గ్యారంటీ అని, ఇది ప్రజలు గుర్తించుకుని వెలుగులు పంచే బీఆర్ఎస్ కు ఓటు వేయాలని కోరారు. వెలుగు కావాలో, చీకటి కావాలో ప్రజలే తెల్చుకోవాలన్నారు.


వచ్చే ఎన్నికల్లో ఈవీఎం డబ్బాలో మూడో నెంబర్ లో ఉన్న కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మంత్రి వెంట మాజీ మంత్రి పీ చంద్రశేఖర్, ఎంపీపీ బాలరాజు, జడ్పీటీసీ విజయనిర్మల, పార్టీ మండల అధ్యక్షుడు కరుణాకర్ గౌడ్, ముడా డైరెక్టర్ కొండ లక్ష్మయ్య, రైతు బంధు సమితి జిల్లా డైరెక్టర్ కొండ బాలయ్య, సింగిల్ విండో వైస్ చైర్మన్ కృష్ణయ్య గౌడ్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు అన్వర్, మండల కో ఆప్షన్ సభ్యుడు మన్నన్, సర్పంచు గిరిజమ్మ, ఎంపీటీసీ లక్ష్మీ అంజిల్ రెడ్డి, నాయకులు మధుసూదన్ రెడ్డి ఉన్నారు.