అలకవీడిన ఎమ్మెల్సీ సుభాష్ఇంటికెళ్లి మద్దతు కోరిన పద్మాదేవేందర్ రెడ్డి

– బీఆరెస్ లో లుకలుకలు సద్దుమణిగేనా?
విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: మెదక్ నియోజకవర్గ బీఆరెస్ లో అసంతృప్తులంతా ఒక్కొక్కరుగా కలిసిపోతున్నారు. నిన్నమొన్నటి వరకు ఉప్పూనిప్పుగా ఉన్న ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి చేతులుకలిపారు. సీఎం కేసీఆర్ కార్యదర్శిగా ఉన్న షేర్ సుభాష్ రెడ్డి మెదక్ ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. అయితే సిటింగ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికే టికెట్ ఖరారుకావడంతో ఎమ్మెల్సీ కొంత అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే దసరా పండుగను పురస్కరించుకొని మంగళవారం ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి స్వయంగా కూచన్ కూడా పల్లిలోని స్వగృహానికి వెళ్లింది. ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డితో చర్చించారు.
సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు పార్టీ శ్రేణులు పేర్కొన్నారు. ఇంటికి వచ్చిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి తేనేటి విందు ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ నారాయణరెడ్డి, పార్టీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, అంజా గౌడ్ బయ్యన్న, శేఖర్ రెడ్డి, కొంపల్లి సుభాష్ రెడ్డి ఉన్నారు. కాగా ఎమ్మెల్సీ అలకవీడినా, పార్టీలోని లుకలుకలు ఎంతవరకు సద్దుమణుగుతాయనేది వేచి చూడాల్సిందే.