కాంగ్రెస్ లోకి మోత్కుపల్లి?

కాంగ్రెస్ లోకి మోత్కుపల్లి?

విధాత: మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నరసింహులు త్వరలో కాంగ్రెస్ లో చేరబోతున్నట్లుగా తెలుస్తోంది. శుక్రవారం ఆయన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను కలవడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. మోత్కుపల్లి రెండు రోజుల్లో హస్తం గూటికి చేరే అవకాశముందని అనుచరవర్గాల సమాచారం.



బీఆర్ఎస్ ఆలేరు టికెట్ ఆశిస్తే ఇవ్వకపోవడం.. తనకు ఆరు నెలలుగా సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ సైతం ఇవ్వకుండా అవమానించారంటూ మోత్కుపల్లి విమర్శించారు. రేవంత్ రెడ్డి తన తమ్ముడి వంటి వాడని, ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ బలోపేతమైందని తాజాగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు కర్ణాటకకు వెళ్లి డీకే శివకుమార్ ను కలిశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన రేపోమాపో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లుగా చర్చ సాగుతోంది.