సీఎం రేవంత్‌రెడ్డితో నేషనల్ స్లైకిస్టు ఆశా మాల్వియా … ట్విట్‌లో అభినందనలు తెలిపిన సీఎం

నేషనల్ సైక్లిస్ట్ ఆశా మాల్వియా ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆశా మాల్వియా కార్గిల్ దివస్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా కన్యాకుమారి నుంచి కార్గిల్ వరకు సైకిల్ యాత్ర నిర్వహిస్తోంది

సీఎం రేవంత్‌రెడ్డితో నేషనల్ స్లైకిస్టు ఆశా మాల్వియా … ట్విట్‌లో అభినందనలు తెలిపిన సీఎం

విధాత, హైదరాబాద్ : నేషనల్ సైక్లిస్ట్ ఆశా మాల్వియా ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆశా మాల్వియా కార్గిల్ దివస్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా కన్యాకుమారి నుంచి కార్గిల్ వరకు సైకిల్ యాత్ర నిర్వహిస్తోంది. జూన్ 24న కన్యాకుమారి నుంచి సైకిల్ యాత్ర ఆశా మొదలుపెట్టింది. ఈ సందర్భంగా అశాను సీఎం రేవంత్ రెడ్డి అభినందిస్తూ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘మన వీర సైనికుల జ్ఞాపకార్థం కార్గిల్ దివాస్ రజతోత్సవ సంవత్సరాన్ని పురస్కరించుకుని కన్యాకుమారి నుంచి కార్గిల్ వరకు సైకిల్ ప్రయాణం ప్రారంభించిన మన దేశానికి చెందిన ధైర్యవంతులైన అథ్లెట్ ఆశా మాల్వీయను కలుసుకున్నాను’ అని ఫోటో పంచుకున్నారు. మహిళ భద్రత, సాధికారత ప్రాముఖ్యత పై అవగాహన కల్పించేందుకు 28 రాష్ట్రాల్లో 25 వేల కిలోమీటర్ల మేర ఆశా ఒంటరిగా ప్రయాణించడాన్ని అభినందించారు.