TELANGANA | తెలంగాణపై ఎన్ డి ఎ వివక్షత నశించాలి … వీసీకే ప్రజాసంఘాల నిరసన

వికసిత్ భారత్ తో మూడవ సారి అధికారంలోకి వచ్చిన ఎన్ డి ఎ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ తెలంగాణకు ఒక్క రూపాయి కేటాయించలేదని, తక్షణమే తెలంగాణకు బడ్జెట్ లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ప్రజాసంఘాలు, విముక్త చిరుతల కచ్చి ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా కేంద్రంలో గురువారం నిరసన చేశారు.

TELANGANA | తెలంగాణపై ఎన్ డి ఎ వివక్షత నశించాలి … వీసీకే ప్రజాసంఘాల నిరసన

విధాత, వరంగల్ ప్రతినిధి:వికసిత్ భారత్ తో మూడవ సారి అధికారంలోకి వచ్చిన ఎన్ డి ఎ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ తెలంగాణకు ఒక్క రూపాయి కేటాయించలేదని, తక్షణమే తెలంగాణకు బడ్జెట్ లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ప్రజాసంఘాలు, విముక్త చిరుతల కచ్చి ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా కేంద్రంలో గురువారం నిరసన చేశారు.

విసికె తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జిలుకర శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఎనిమిది సీట్లు బిజెపికి ఇచ్చారని, బిజెపి మాత్రం రిటర్న్ గిఫ్ట్ గా తెలంగాణకు బడ్జెట్ లో గుండుసున్నా ఇచ్చిందని విమర్శించారు. ఈ అన్యాయానికి నైతిక బాధ్యత వహిస్తూ తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు రాజీనామ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర బుడ్జెట్ పై తెలంగాణ అసెంబ్లీలో జరిగిన చర్చకు సమాధానం చెప్పలేక తెలంగాణ అసెంబ్లీ నుండి బిజెపి ఎమ్మెల్యేలు వాకవుట్ చేసి ముఖం చాటేశారని ఆయన విమర్శించారు.
దక్షణాది ఆత్మగౌరవ వేదిక రాష్ట్ర కన్వీనర్‌ తాడిశెట్టి క్రాంతి మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేశారని ఆరోపించారు. మోదీ కుర్చీని కాపాడుకోవడానికి బీహారు, ఎపిలకు మాత్రమే నిధులు కేటాయించారని, ఇది దక్షిణాది వ్యతిరేక బడ్జెట్ అని క్రాంతి కుమార్ విమర్శించారు. బి.సి. ఓట్లతో గద్దెనెక్కిన మోడీ బడ్జెట్ లో బిసిలకు జనాభా ప్రకారం నిధులు కేటాయించకుండా, బిజెపి బిసి లకు తీవ్ర అన్యాయం చేసిందని ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్ విమర్శించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బి.సి లు ఎవరూ బిజెపి కి ఓటు వేయొద్దని ఆయన పిలుపునిచ్చారు. దళిత గిరిజనులకు నిధులు కేటాయించని బడ్జెట్ ను దళిత బహుజన ఫ్రంట్ వ్యతిరేకిస్తుందని డిబిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చుంచు రాజేందర్ అన్నాడు.
ఈ కార్యక్రమంలో విసికె రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మచ్చ దేవేందర్, విసికె వరంగల్ జిల్లా అధ్యక్షుడు కన్నాల రవి, విసికె నాయకులు మచ్చ విశ్వతేజ, వినయ్, బిసి నాయకులు సూరం నిరంజన్, న్యాయవాదులు రంజిత్ గౌడ్, ఎగ్గడి సుందర్ రామ్, జె జె స్వామి తదితరులు పాల్గొన్నారు.