పెద్దపల్లి బీఆర్ఎస్ కు షాక్.. రేవంత్ సమక్షంలో భారీగా చేరికలు

పెద్దపల్లి బీఆర్ఎస్ కు షాక్.. రేవంత్ సమక్షంలో భారీగా చేరికలు

విధాత ప్రతినిధి, పెద్దపల్లి: పెద్దపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కొంతకాలంగా అసంతృప్తితో రగిలిపోతున్న ఆ పార్టీ నాయకులు పలువురు శనివారం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.


కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గ అభ్యర్థి చింతకుంట విజయరమణ రావు ఆధ్వర్యంలో బీఆరెస్ నాయకులు రేగుంట అశోక్ గౌడ్, మందల సత్యనారాయణ రెడ్డి, పెగడ రమేష్ యాదవ్, ఎండీ ఇక్బాల్, కటికేనలపెళ్లి రవి, శ్రీనివాస్ రెడ్డి, షేక్ ఫాహిమ్, కీర్తి రాజయ్య లకు రేవంత్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నవంబర్ లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయరమణ రావుని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంట రమేష్, అమీరిషెట్టి సతీష్, అస్లామ్ పాల్గొన్నారు.