కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన పోలీసులు

విధాత : సాగునీటి కొరతతో పంటలు ఎండిపోయిన రైతులకు భరోసా కల్పించేందుకు బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేపట్టిన పొలం బాట కార్యక్రమంలో ఆయన ప్రయాణిస్తున్న బస్సును జనగామ దాటక సూర్యాపేట జిల్లా ఈదుల తండా చెక్ పోస్టు వద్ద పోలీసు బృందాలు తనిఖీ చేశాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో సాధారణ తనిఖీల్లో భాగంగా పోలీసులు కేసీఆర్ బస్సును తనిఖీ చేశారు. పోలీసులు కేసీఆర్ బస్సును ఆపి తనిఖీ చేసే క్రమంలో ఎందుకు బస్సు ఆపుతున్నారో తొలుత అర్ధంకాని బీఆరెస్ నేతలు వారితో వాగ్వివాదానికి దిగారు. బస్సు వెంట సాగిన కార్యకర్తలు సీఎం రేవంత్‌రెడ్డి డౌన్‌డౌన్ అంటు నినాదాలు చేశారు. అయితే ఎన్నికల కోడ్‌లో భాగంగా చేపట్టిన తనిఖీ కావడంతో బీఆరెస్ నేతలు కార్యకర్తలకు సర్ధిచెప్పి తనిఖీకి సహకరించారు. పోలీసుల తనిఖీ ముగిశాక కేసీఆర్ బస్సు ముందుకు కదిలింది.