ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి: అదనపు కలెక్టర్ రమేష్
విధాత, మెదక్ బ్యూరో: ప్రజావాణిలో వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి వెనువెంటనే పరిష్కరించే దిశగా కృషి చేయాలని అదనపు కలెక్టర్ రమేష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని ప్రజావాణి హాల్ లో నిర్వహించిన ప్రజావాణికి జిల్లా నలుమూలల నుండి వచ్చిన (33) ఫిర్యాదులను జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్ తో కలిసి స్వీకరించారు. ఇందులో ప్రధానంగా ధరణి, పోడు భూములకు సంబంధించి 29 దరఖాస్తులు రాగా, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మంజారుకై 4 దరఖాస్తులు […]

విధాత, మెదక్ బ్యూరో: ప్రజావాణిలో వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి వెనువెంటనే పరిష్కరించే దిశగా కృషి చేయాలని అదనపు కలెక్టర్ రమేష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని ప్రజావాణి హాల్ లో నిర్వహించిన ప్రజావాణికి జిల్లా నలుమూలల నుండి వచ్చిన (33) ఫిర్యాదులను జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్ తో కలిసి స్వీకరించారు.
ఇందులో ప్రధానంగా ధరణి, పోడు భూములకు సంబంధించి 29 దరఖాస్తులు రాగా, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మంజారుకై 4 దరఖాస్తులు వచ్చాయి. వివరాలు ఇలా…
మనోహరాబాద్ మండలం కొండాపూర్ గ్రామ శివారులోని 129, 132 సర్వే నెంబరులో కొంత భూమిని TSIIC వారికి అప్పగించి నష్టపరిహారం ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదని, నష్ట పరిహారం ఇప్పించవలసిందిగా ఆ గ్రామ రైతులు శివ శంకర్, జల్లి లింగం తదితరులు విజ్ఞప్తి చేశారు.
మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లిలోని 32,354 సర్వే నెంబరులో భూమిని కోల్పోయిన తనకు నష్టపరిహారం ఇప్పించవలసిందిగా రాకేష్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.
బీదరాలైన తనకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయవలసినదిగా తూప్రాన్ నివాసి నన్నూరి అరుణ విజ్ఞప్తి చేశారు.
వెల్దుర్తి మండలం నెల్లూరు శివారులోని 131/అ సర్వే నెంబరులో 0. 29 గుంటల భూమి గత పాస్ పుస్తకంలో ఉన్నా నేడు కొత్త పుస్తకంలో నమోదు కాలేదని సరిచేయవలసినదిగా నర్సయ్య కోరారు.
ప్రజావాణి అనంతరం నూతన సంవత్సరం సందర్భంగా అదనపు కలెక్టర్ కేక్ ను కట్ చేస్తూ జిల్లాను అన్ని రంగాలలో ప్రగతి పథంలో ముందుంచుటలో అధికారులు అంకితభావంతో పనిచేయాలని కోరారు.
కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల అధికారి కృష్ణ మూర్తి, నీటిపారుదల శాఖ ఈఈ శ్రీనివాస్ రావు, సి.పి .ఓ. మహమ్మద్ కాసిం, మత్స్య శాఖ ఎడి రజిని, పశుసంవర్ధక శాఖాధికారి విజయ శేఖర్ రెడ్డి, జిల్లా మైనారిటి అధికారి జెంలా నాయక్, కలెక్టరేట్ ఏ.ఓ. యూనుస్ తదితరులు పాల్గొన్నారు.