కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని ప్ర‌తీ గ‌డ‌ప‌కు తెలియ‌జేయాలి: నాయిని

విధాత, వరంగల్: హాత్ సే హాత్ జోడో ద్వారా ప్రతి డివిజన్ లో పార్టీ జెండా ఎగురవేసి కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని ప్రతీ గడపకు తెలియచేద్దామని హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ భవన్ లో ఆదివారం సమావేశంనిర్వ‌హించారు. ఈ నెల 26న ప్రారంభం కానున్న కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర హాత్ సే హాత్ జోడో చేయి చేయి కలుపుదాం ద్వారా కాంగ్రెస్ పార్టీ […]

కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని ప్ర‌తీ గ‌డ‌ప‌కు తెలియ‌జేయాలి: నాయిని

విధాత, వరంగల్: హాత్ సే హాత్ జోడో ద్వారా ప్రతి డివిజన్ లో పార్టీ జెండా ఎగురవేసి కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని ప్రతీ గడపకు తెలియచేద్దామని హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ భవన్ లో ఆదివారం సమావేశంనిర్వ‌హించారు.

ఈ నెల 26న ప్రారంభం కానున్న కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర హాత్ సే హాత్ జోడో చేయి చేయి కలుపుదాం ద్వారా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్ళే అంశంపై స‌మావేశంలో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ జోడో యాత్రలో ప్రతి ఒక్కరు పాల్గొని యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో మాజీ ఎం. పి సిరిసిల్ల రాజయ్య, వర్దన్నపేట నియోజకవర్గం కోఆర్డినేటర్ నమ్మిండ్ల శ్రీనివాస్, పరకాల నియోజకవర్గం కోఆర్డినేటర్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి కుచన రవళి, కార్పొరేటర్ తోట వెంకన్న, జిల్లా మహిళా అధ్యక్షురాలు బంక సరళ, కూర వెంకట్, బొమ్మతి విక్రమ్, నసీ్మజహాన్, బి.అశోక్ రెడ్డి, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.