మరో ఉద్యమానికి నాంది-ఈటల

కరీంనగర్‌: హుజూరాబాద్‌ మరో ఉద్యమానికి నాంది కాబోతోందని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. అబద్ధాలకోరులు తమని అడ్డుకోలేరని పేర్కొన్నారు. ఆయన మంగళవారం హుజూరాబాద్‌ నియాజకవర్గంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా కమలాపురం మండలం శంభునిపల్లిలో రోడ్డు షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఆత్మగౌరవానికి హుజూరాబాద్‌ ప్రజలు ఊపిరిపోయాలన్నారు. ప్రగతిభవన్‌ నుంచి వచ్చే స్క్రిప్ట్‌ను చదవడమే కొందరి పని అని ఆరోపించారు. తన గురించి మాట్లాడేవారి చరిత్ర కాలగర్భంలో కలిసిపోతుందన్నారు. నియోజకవర్గ […]

మరో ఉద్యమానికి నాంది-ఈటల

కరీంనగర్‌: హుజూరాబాద్‌ మరో ఉద్యమానికి నాంది కాబోతోందని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. అబద్ధాలకోరులు తమని అడ్డుకోలేరని పేర్కొన్నారు. ఆయన మంగళవారం హుజూరాబాద్‌ నియాజకవర్గంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా కమలాపురం మండలం శంభునిపల్లిలో రోడ్డు షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఆత్మగౌరవానికి హుజూరాబాద్‌ ప్రజలు ఊపిరిపోయాలన్నారు. ప్రగతిభవన్‌ నుంచి వచ్చే స్క్రిప్ట్‌ను చదవడమే కొందరి పని అని ఆరోపించారు. తన గురించి మాట్లాడేవారి చరిత్ర కాలగర్భంలో కలిసిపోతుందన్నారు. నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం కోసం వచ్చానని, 19ఏళ్లు తెలంగాణ ఉద్యమం కోసం పని చేశానని చెప్పారు.