భరోసా కల్పించడానికే ప్రజా దివస్‌

సీపీకి సమస్యలు వివరిస్తున్న బాధితులు ఖమ్మం: సమస్యలను పరిష్కరించి బాధితులకు భరోసా కల్పించడమే ప్రజా దివస్‌ ముఖ్య ఉద్దేశమని సీపీ విష్ణు ఎస్‌.వారియర్‌ అన్నారు.ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దివస్‌ కార్యక్రమం సోమవారం సీపీ కార్యాలయంలో నిర్వహించారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల ఫిర్యాదులను పరిశీలించిన ఆయన పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు.భూవివాదాలు, వ్యక్తిగత సమస్యలతోపాటు ఆర్థిక లావాదేవీలు, భార్యాభర్తల సమస్యలపై అధిక శాతం ఫిర్యాదులు వచ్చాయి. ఆయా ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో విచారణ జరిపి […]

భరోసా కల్పించడానికే ప్రజా దివస్‌

సీపీకి సమస్యలు వివరిస్తున్న బాధితులు

ఖమ్మం: సమస్యలను పరిష్కరించి బాధితులకు భరోసా కల్పించడమే ప్రజా దివస్‌ ముఖ్య ఉద్దేశమని సీపీ విష్ణు ఎస్‌.వారియర్‌ అన్నారు.ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దివస్‌ కార్యక్రమం సోమవారం సీపీ కార్యాలయంలో నిర్వహించారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల ఫిర్యాదులను పరిశీలించిన ఆయన పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు.భూవివాదాలు, వ్యక్తిగత సమస్యలతోపాటు ఆర్థిక లావాదేవీలు, భార్యాభర్తల సమస్యలపై అధిక శాతం ఫిర్యాదులు వచ్చాయి.

ఆయా ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బాధితులకు భరోసా కల్పించారు.బాధితులు ఇచ్చే ప్రతి ఫిర్యాదుపై కచ్చితంగా సకాలంలో స్పందించి విచారణలో వచ్చే వాస్తవాలకు అనుగుణంగా వారికి సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా పనిచేయాలని ఈ సందర్భంగా పోలీసు అధికారులను సీపీ ఆదేశించారు.