రామ‌ప్ప ఆల‌యానికి రాహుల్‌, ప్రియాంక‌లు

రాహుల్‌గాంధీ, ప్రియాకంలు ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో ములుగు జిల్లా పాలంపేట‌కు చేరుకున్నారు. హెలిప్యాడ్ వ‌ద్ద టీపీసీసీ నాయ‌కులు వారికి ఘనస్వాగతం పలికారు

రామ‌ప్ప ఆల‌యానికి రాహుల్‌, ప్రియాంక‌లు

విధాత‌: బేగంపేట నుంచి రాహుల్‌గాంధీ, ప్రియాకంలు ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో ములుగు జిల్లా పాలంపేట‌కు చేరుకున్నారు. హెలిప్యాడ్ వ‌ద్ద టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, భట్టి, ఉత్తమ్, పొంగులేటి, సీతక్క, ఇతర నేతలు ఘనస్వాగతం పలికారు. అక్క‌డి నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఇతర నేతలు రామప్ప ఆలయానికి చేరుకున్నారు. రామ‌ప్ప ఆల‌యంలో రాహుల్‌, ప్రియాంక గాంధీలు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ప్రాచీన శిల్ప కళ నైపుణ్యాలను, దేవాలయం చరిత్ర గురించి రాహుల్ ప్రియాంకలు ఆల‌య నిర్వాహ‌కులను అడిగి తెలుసుకున్నారు.