కాంగ్రెస్ సునామితో కేసీఆర్ కొట్టుకపోతారు: రేణుకా చౌదరి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న కాంగ్రెస్ సునామిలో కేసీఆర్ ప్రభుత్వం కొట్టుకపోతుందని మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి అన్నారు

విధాత: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న కాంగ్రెస్ సునామిలో కేసీఆర్ ప్రభుత్వం కొట్టుకపోతుందని మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి అన్నారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ పువ్వాడ అజయ్ ఓటమి భయంతో మా కార్యకర్తల పై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. మా ఖమ్మం కార్పొరేటర్ రాఫీనా బేగం పైనా బైండోవర్ కేసులు వేశారని, ఎంఐఎం, బీఆరెస్‌లు కలిసి ఇబ్బందులు పెడుతున్నారని, పోలీసులు చట్టానికి విరుద్దంగా అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారన్నారు.
కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బంది పెడితే ఖబడ్డర్ అన్నారు. ఖమ్మం జిల్లాలో 10 కి 10 స్థానాలు గెలుస్తామన్నారు. అజయ్ మీ ఇంటికి వచ్చి సవాలు చేస్తానని, నువ్వు ఓడిపోయిన తక్షణం అక్కడి నుండి పారిపోతావ్ అన్నారు. కాంగ్రెస్ లో గెలిచి పార్టీ మారిన పువ్వాడ అజయ్ లాంటి వారిని దగ్గరకు తీసుకోవడం వల్లే కేసీఆర్ ఓడిపోతున్నాడన్నారు. పువ్వాడ అజయ్ పాము కు పాలు పోస్తే కాటు వేసే రకమని, ఆయన కాంగ్రెస్ కార్యకర్తలను ఎంత ఇబ్బంది పెడితే అంత బలంగా ముందుకు వస్తారన్నారు.
బీజేపీ ,బీఆరెస్, ఎంఐఎంలు ఒక్కటై మతతత్వ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ గెలుపు కోసం ప్రచారం చేస్తానన్నారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కాంగ్రెస్ నేతలపై ఐటీ దాడులు చేస్తున్నాయని, మీరు దాడులు చేస్తారని మేము పైసలు ఇంట్లో పెట్టుకొని కూర్చుంటామా అన్నారు. బీఆరెస్ లో ఎంతమంది కోవర్ట్ లు ఉన్నారో మాకు తెలుసని, మాకు కోవర్ట్ లు ఉన్నారని, వారికి కూడా కోవర్ట్ లు ఉన్నారన్నారని సంగతి గ్రహించాలన్నారు.