వీఆర్‌వో వ్యవస్థ పునరుద్దరణకు మంత్రి పొంగులేటికి వినతి

బీఆరెస్‌ ప్రభుత్వం వీఆర్‌వో వ్యవస్థను రద్ధు చేసి రెవెన్యూ వ్యవస్థను గందరగోళం చేసిందని, ఈ వ్యవస్థను మళ్లీ పునరుద్ధరించాలని మంత్రి పొంగులేటికి బుధవారం వినతి

వీఆర్‌వో వ్యవస్థ పునరుద్దరణకు మంత్రి పొంగులేటికి వినతి

విధాత : బీఆరెస్‌ ప్రభుత్వం వీఆర్‌వో వ్యవస్థను రద్ధు చేసి రెవెన్యూ వ్యవస్థను గందరగోళం చేసిందని, ఈ వ్యవస్థను మళ్లీ పునరుద్ధరించాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి బుధవారం వినతి పత్రం అందించింది. పలు శాఖల్లో కలిపిన వీఆర్‌వో, వీఆర్‌ఏలనలు తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలని కోరింది. కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుతో పాటు గ్రామ పరిపాలన ద్వారా సంక్షేమ పథకాలను సమర్ధంగా తీసుకెళ్లాలంటే వీఆర్‌వో వ్యవస్థను పునరుద్ధించాలని వారు కోరారు. సీసీఎల్‌ఏ నవీన్‌ మిట్టల్‌ సమక్షంలోనే వారు తమ సమస్యలను మంత్రి పొంగులేటికి వివరించారు. స్పందించిన మంత్రి పొంగులేటి త్వరలోనే రెవెన్యూ ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి ఈ సమస్యపై చర్చిస్తాని మంత్రి వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రేసా అధ్యక్షుడు వంగ రవిందర్‌రెడ్డి, వీఆర్‌వో జేఏసీ చైర్మన్‌ గోల్కొండ సతీశ్‌లు పాల్గొన్నారు.

వీఆర్‌ఏల పెండింగ్‌ వేతనాల విడుదలకు ఆదేశాలు

పలు శాఖల్లో సూపర్‌ న్యూమరీ పోస్టులలో పనిచేస్తున్న 15,560మంది వీఆర్‌ఏలకు సంబంధించిన ఏడు నెలల పెండింగ్‌ వేతనాలను రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఏడు నెలల వేతనాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్లను సీసీఎల్‌ఏ అదేశించారు. సంబంధిత మోమోను జారీ చేశారు. జీవో నంబర్‌ 81, 85ల ద్వారా వివిధ శాఖల్లో గ్రేడ్ సర్వీసెస్/రికార్డు అసిస్టెంట్స్ జూనియర్ అసిస్టెంట్లుగా పని చేస్తున్నారు. వారందరికీ రెగ్యులర్ పే స్కేల్‌ను అమలు చేయాలని నిర్ణయించారు. కొన్ని నెలలుగా వేతనాలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నవీఆర్‌ఏలకు ఈ నిర్ణయంతో మేలు జరుగనుంది.