ఆరు వారాలు, ఆరు హామీలు: రేవంత్‌రెడ్డి

- ఆరు నూరైనా ఓడేది కారు
విధాత, హైదరాబాద్: ఎక్స్ ట్విట్టర్ వేదికగా రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఎన్నికల నగారా మోగడంతో నేతల ప్రచారాలు ముమ్మరం చేస్తున్నారు. కొద్దిరోజులుగా బీఆరెస్, కేసీఆర్ ఫ్యామిలీపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ల ద్వారా విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి తన అధికారిక ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేశారు. ‘ఆరు వారాలు, ఆరు హామీలు, ఆరు నూరైనా ఓడేది కారు, హస్తం గెలుపు ఖరారు’ అంటూ ట్వీట్ చేశారు.