తెలంగాణలో మూతపడిన దుకాణాలు
విధాత(హైదరాబాద్): తెలంగాణలో లాక్‌డౌన్ ప్రారంభమైంది. లాక్‌డౌన్ సడలింపులు ముగియడంతో ఈ ఉదయం 10 గంటల నుంచి హైదరాబాద్ సహా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో దుకాణాలు మూతపడ్డాయి. ఇతర కార్యకలాపాలు నిలిచిపోయాయి. లాక్‌డౌన్ సమయం దగ్గర పడటంతో ఇళ్లకు చేరుకునేందుకు పలువురు ఉరుకులు పరుగులు తీశారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో రోడ్లు, బస్టాండ్లు, మెట్రో స్టేషన్లు నిర్మానుష్యంగా మారాయి. హైదరాబాద్‌లోని అమీర్‌పేట, పంజాగుట్ట, ఎస్‌ఆర్ నగర్ తదితర ప్రాంతాల్లో వస్త్ర, వాణిజ్య, దుకాణ సముదాయాలను వ్యాపారులు మూసివేశారు. లాక్‌డౌన్ నిబంధనలను […]

విధాత(హైదరాబాద్): తెలంగాణలో లాక్‌డౌన్ ప్రారంభమైంది. లాక్‌డౌన్ సడలింపులు ముగియడంతో ఈ ఉదయం 10 గంటల నుంచి హైదరాబాద్ సహా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో దుకాణాలు మూతపడ్డాయి. ఇతర కార్యకలాపాలు నిలిచిపోయాయి. లాక్‌డౌన్ సమయం దగ్గర పడటంతో ఇళ్లకు చేరుకునేందుకు పలువురు ఉరుకులు పరుగులు తీశారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో రోడ్లు, బస్టాండ్లు, మెట్రో స్టేషన్లు నిర్మానుష్యంగా మారాయి. హైదరాబాద్‌లోని అమీర్‌పేట, పంజాగుట్ట, ఎస్‌ఆర్ నగర్ తదితర ప్రాంతాల్లో వస్త్ర, వాణిజ్య, దుకాణ సముదాయాలను వ్యాపారులు మూసివేశారు.
లాక్‌డౌన్ నిబంధనలను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రధాన కూడళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన అత్యవసర సేవలను మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వస్తున్న వారిని వెనక్కి పంపుతున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ పరీక్షలు, వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. వ్యాక్సిన్ కోసం ఆస్పత్రుల వద్ద ప్రజలు బారులు తీరారు. లాక్‌డౌన్ సమయంలో ఆస్పత్రులకు వచ్చి వెళ్లేవారికి ఆటంకం కలిగించొద్దని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది..