నాగర్‌కర్నూల్‌ జిల్లాలో స్వల్ప భూకంపం

విధాత:నాగర్‌కర్నూల్‌ జిల్లాలో స్వల్ప భూకంపం వచ్చింది. జిల్లాలోని అచ్చంపేట, లింగాల పరిసర గ్రామాలు, అమ్రాబాద్‌, ఉప్పునూత మండలాల్లో సోమవారం ఉదయం 5 గంటలకు రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 4.0గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (ఎన్‌సీఎస్‌) వెల్లడించింది. హైదరాబాద్‌కు దక్షి ణంగా 150 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని తెలిపింది. భూ అంతర్భాగం లో 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు వచ్చాయని పేర్కొన్నది. భూ ప్రకంపనలతో […]

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో స్వల్ప భూకంపం

విధాత:నాగర్‌కర్నూల్‌ జిల్లాలో స్వల్ప భూకంపం వచ్చింది. జిల్లాలోని అచ్చంపేట, లింగాల పరిసర గ్రామాలు, అమ్రాబాద్‌, ఉప్పునూత మండలాల్లో సోమవారం ఉదయం 5 గంటలకు రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 4.0గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (ఎన్‌సీఎస్‌) వెల్లడించింది. హైదరాబాద్‌కు దక్షి ణంగా 150 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని తెలిపింది. భూ అంతర్భాగం లో 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు వచ్చాయని పేర్కొన్నది. భూ ప్రకంపనలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.