Smart Phone Charging | ఐడియా అదిరిపోయింది..! డీజిల్ మోటార్‌తో స్మార్ట్ ఫోన్లకు ఛార్జింగ్..!!
Smart Phone Charging | ఈ భూమ్మీద ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది అనడానికి ఈ సంఘటనే నిదర్శనం. ఎందుకంటే కరెంట్ సరఫరా( Power Supply ) నిలిచిపోవడంతో.. స్మార్ట్ ఫోన్లకు( Smart Phones ) ఛార్జింగ్( Charging ) పెట్టుకునే పరిస్థితి లేదు. ఓ కొత్త ఐడియా( Idea )తో ముందుకు వచ్చారు కొందరు. డీజిల్ మోటార్( Diesel Motor ) ఆన్ చేసి.. దాని ద్వారా తమ స్మార్ట్ ఫోన్లకు చార్జింగ్ పెట్టుకున్నారు. ఐడియా అదిరిపోయింది కదా..!

Smart Phone Charging | గత రెండు రోజుల నుంచి తెలంగాణ( Telangana ) వ్యాప్తంగా భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం( Rain ) కురుస్తోన్న సంగతి తెలిసిందే. గాలివాన బీభత్సానికి చాలా ప్రాంతాల్లో భారీ వృక్షాలు( Trees ), విద్యుత్ స్తంభాలు( Power Poles ) నేలకొరిగాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా( Power Supply )కు తీవ్ర అంతరాయం కలిగింది. వికారాబాద్ జిల్లా( Vikarabad District ) పెద్దేముల్ మండలం తట్టేపల్లి గ్రామం( Tattepalli Village )లో రెండు రోజులుగా విద్యుత్ సరఫరా( Power Supply ) నిలిచిపోయింది.
దీంతో తట్టేపల్లి గ్రామంలో కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో.. తాగునీటికి( Drinking Water ) ఆటంకం ఏర్పడింది. అంతేకాకుండా నిత్యం స్మార్ట్ ఫోన్లలో( Smart Phones ) మునిగి తేలేవారికి విద్యుత్ సరఫరా( Power Supply ) అంతరాయం కాస్త ఇబ్బందిని తెచ్చి పెట్టింది. విద్యుత్ సరఫరా అంతరాయంతో స్మార్ట్ ఫోన్లకు ఛార్జింగ్ పెట్టుకోలేని పరిస్థితి. అన్ని ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయి. మరి ఏం చేయాలి.. ఇతరులతో కమ్యూనికేట్ ఎలా..? టైం పాస్ ఎలా అవుతుందని ఆలోచించారు.
అనుకున్నదే తడువుగా గ్రామస్తులందరూ చందాలు వేసుకున్నారు. ఒక డీజిల్ మోటార్( Diesel Motor ) కిరాయికి తీసుకొచ్చారు. డీజిల్ సహాయంతో ఆ మోటార్‌ను ఆన్ చేసి తాగునీటిని పట్టుకున్నారు. అదే డీజిల్ మోటార్ ద్వారా స్విచ్ బోర్డుకు విద్యుత్ సరఫరా అయ్యేలా ఏర్పాట్లు చేశారు. ఇంకేముంది.. ఆ స్విచ్ బోర్డు నుంచి పదుల సంఖ్యలో సెల్ ఫోన్లకు ఛార్జింగ్ పెట్టుకున్నారు. అనంతరం మళ్లీ ఫోన్లలో బిజీ అయిపోయారు. ఒక్క ఐడియా పదుల సంఖ్యలో సెల్ఫోన్లకు ఛార్జింగ్ పెట్టుకునేలా చేసింది.
రెండు రోజులుగా కరెంట్ లేకపోవడంతో డీజిల్ మోటార్‌కు ఫోన్లు ఛార్జింగ్ పెట్టుకున్న గ్రామస్తులు
వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం తట్టేపల్లి గ్రామంలో రెండు రోజులుగా నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
గత్యంతరం లేక చందాలు వేసుకొని డీజిల్ మోటార్ సహాయంతో నీటి సరఫరా చేసుకున్న గ్రామస్తులు… pic.twitter.com/RDShhBjhg2
— Telugu Scribe (@TeluguScribe) April 19, 2025