ఉత్సాహంగా సంక్రాంతి సంబురాలు
జిల్లా కేంద్రమైన మెదక్‌లోని సిద్దార్థ్ గ్రూప్ ఆఫ్ స్కూల్ లో మెదక్ శాసన సభ్యులు మైనంపల్లి రోహిత్ సతీమణి శివాణిరెడ్డి ఆధ్వర్యంలో గురువారం సంక్రాంతి పండుగ

- ఎమ్మెల్యే రోహిత్ సతీమణి శివాణి రెడ్డి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు
- అబ్బుర పరిచిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు
- కనువిందు చేసిన ముగ్గుల పోటీలు
విధాత, మెదక్ బ్యూరో : జిల్లా కేంద్రమైన మెదక్‌లోని సిద్దార్థ్ గ్రూప్ ఆఫ్ స్కూల్ లో మెదక్ శాసన సభ్యులు మైనంపల్లి రోహిత్ సతీమణి శివాణిరెడ్డి ఆధ్వర్యంలో గురువారం సంక్రాంతి పండుగ సంబురాలు అంబరానంటాయి. మెదక్ శాసన సభ్యులు డాక్టర్ మైనంపల్లి రోహిత్ సతీమణి శివాణి రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. పాఠశాల్లో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలలో మెదక్ మహిళా మణులు ఉత్సాహంగా పోటీపడ్డారు. పలు రకాలుగా వేసిన ముగ్గులు అందరిని ఆకట్టుకున్నాయి. చిన్నారుల బోగి పండ్ల కార్యక్రమం అందరిని ఆకట్టుకుంది. అనంతరం విద్యార్థిని విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అబ్బుర పరిచాయి.

ముగ్గుల పోటీలో భాగంగా మొదటి బహుమతి అవంతి గెలుచుకోగా, రెండవ బహుమతి మాలతి, మూడవ బహుమతిగా వారణాసి సౌమ్య, పి. సౌమ్య, శిరిషలు గెలుచుకోన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దార్థ్ గ్రూప్ ఆఫ్ స్కూల్ కరెస్పాండెంట్, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ చౌదరి, సంధ్యారాణి, పాపన్నపేట ఎంపిపి చందనా ప్రశాంత్ రెడ్డి, కౌన్సిలర్ లు దొంతి లక్ష్మి ముత్యం గౌడ్, ఆవారి శేఖర్, దాయర లింగం, మాజీ మున్సిపల్ చైర్మెన్ కొండన్ సురేందర్ గౌడ్, పట్టణ అధ్యక్షులు గూడూరి ఆంజనేయులు, మాజీ కౌన్సిలర్ లు బట్టి సులోచన, జ్యోతి, హరిత, కీర్తి రితీష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బొజ్జ పవన్, ఉప్పల రాజేశ్, డా. పవన్, భూపతి, హరిత, గూడూరి శంకర్ గౌడ్, పిల్లికొట్టాల్ నాగరాజు, సంగమేశ్వర్, సాయి, రమేశ్, దేవులా తో పాటు సిద్దార్థ్ పాఠశాల సిబ్బంది తో పాటు తదితరులు పాల్గోన్నారు