ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం: స్పీకర్ పోచారం

విధాత, నిజామాబాద్: ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని అమలు చేస్తుందని శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రెండవ విడత "కంటి వెలుగు" కార్యక్రమాన్ని బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో గురువారం పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని, పేద ప్రజల కంటి సమస్యల నివారణకు ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ఉచితంగా వైద్య […]

ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం: స్పీకర్ పోచారం

విధాత, నిజామాబాద్: ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని అమలు చేస్తుందని శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రెండవ విడత “కంటి వెలుగు” కార్యక్రమాన్ని బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో గురువారం పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని, పేద ప్రజల కంటి సమస్యల నివారణకు ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ఉచితంగా వైద్య సేవలను అందిస్తుందన్నారు.

కంటి చూపు లేని జీవితం అంధకారమన్నారు. మొదటి విడత కంటి వెలుగు కార్యక్రమం మంచి ఫలితాలను అందించిందన్నారు. రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు కేటాయించిందని చెప్పారు.

కామారెడ్డి జిల్లాలో మొత్తం 44 కంటి వెలుగు వైద్య బృందాలను ఏర్పాటు చేశారని, అవసరమైన వారికి ఉచితంగా కళ్ళద్దాలు అందిస్తామన్నారు. మెడికల్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్, వైద్య ఆరోగ్య శాఖాధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.