దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ: మంత్రి ఈశ్వర్
బ్రెయిలీ జయంతి సందర్భంగా రక్తదానం విధాత: వరంగల్: తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమం కోసం అనేక ప్రత్యేక సౌకర్యాలను రూపొందించి అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ఎస్సీ, మైనారిటీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. అంధుల ఆరాధ్య దైవం డా.లూయిస్ బ్రెయిలీ 214వ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ అంధ ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు బ్యాంక్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి […]

- బ్రెయిలీ జయంతి సందర్భంగా రక్తదానం
విధాత: వరంగల్: తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమం కోసం అనేక ప్రత్యేక సౌకర్యాలను రూపొందించి అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ఎస్సీ, మైనారిటీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
అంధుల ఆరాధ్య దైవం డా.లూయిస్ బ్రెయిలీ 214వ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ అంధ ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు బ్యాంక్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్,స్థానిక శాసన సభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొన్నారు.
ముందుగా బ్రెయిలీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అంధుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన క్యాలెండర్ ను వారు ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా అంధులు రక్తదానం చేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ అంధుల ఆరాధ్యదైవం అయిన లూయిస్ బ్రెయిలీ 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని హైదరాబాద్‌లో ఆవిష్కరించినట్టు తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాల్లో బ్రెయిలీ విగ్రహాన్ని అవిష్కరించాలన్న మీ కోరిక అమలుకు అధికారులను అదేశిస్తామని హామీని ఇచ్చారు.
బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయాలన్న కోరికను పరిశీలిస్తామన్నారు.
చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ హనుమకొండలో కార్యాలయం కావాలన్న కోరిక తీర్చినట్లు చెప్పారు. బ్రెయిలీ లిపితో ప్రపంచాన్ని జయించడం అభినందనీయమన్నారు. అలాగే విద్య, వైద్య, ఉద్యోగ, ఉపాధి, క్రీడా రంగాల్లో రాణించడం గొప్ప విషయమని ఆయన కొనియాడారు.
రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ కే.వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ… ఉమ్మడి రాష్ట్రంలో వికలాంగులంటే చాలా చిన్న చూపు ఉండేదని కానీ రాష్ట్రం ఏర్పడినంక వికలాంగులకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు.
కార్యక్రమంలో కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, సి.డబ్ల్యు.సి అధ్యక్షురాలు అనితారెడ్డి, కార్యక్రమ అధ్యక్షులు కృష్ణ, ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి విచ్చేసిన అంధులు తదితరులు పాల్గొన్నారు.