సీబీఐ విచారణతో దోషులకు శిక్ష పడుతుంది : మంత్రి శ్రీధర్ బాబు

మంత్రి శ్రీధర్ బాబు: కాళేశ్వరం నిర్మాణ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు పూర్తి చేసి దోషులపై కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

సీబీఐ విచారణతో దోషులకు శిక్ష పడుతుంది : మంత్రి శ్రీధర్ బాబు

విధాత, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ అక్రమాలపై సీబీఐ పూర్తి స్థాయి విచారణ చేసి దోషులను గుర్తించి కఠినంగా శిక్షిస్తుందని మంత్రి డి. శ్రీధర్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజలకిచ్చిన హామీ మేరకు కాళేశ్వరం నిర్మాణ అక్రమాలపై జ్యూడిషియల్ కమిషన్ వేశామని..జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆనాటి ప్రభుత్వ పెద్దలు, అధికారులు, కాంట్రాక్టు సంస్థలు ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డారో కమిషన్ నివేదించిందన్నారు.

కమిషన్ నివేదికను అసెంబ్లీలో పెట్టి అందరి సభ్యులకు చర్చించే అవకాశం కల్పించి వారి అభిప్రాయాలు తీసుకున్నామన్నారు. సభ నిర్ణయం మేరకు కాళేశ్వరం నిర్మాణ అక్రమాలపై మరింత లోతైన విచారణకు సీబీఐ దర్యాప్తుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సీబీఐ దర్యాప్తుపై తమకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉందని..దోషులను గుర్తించి శిక్షిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.