శ్రీకాంతాచారి ఆశయాలు సాధిస్తాం: మంత్రి జగదీష్ రెడ్డి
విధాత, తెలంగాణ మలి దశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంత్ చారి బలిదానం ఆశయాలను సాధించడంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిరంతరం నిమగ్నమై పనిచేస్తుందని రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన పొడిచేడులో శ్రీకాంత్ చారి 13 వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరుడైన శ్రీకాంత్ చారి బలిదానాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరోవబోరన్నారు. ప్రభుత్వం ఆయన ఆశయ […]

విధాత, తెలంగాణ మలి దశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంత్ చారి బలిదానం ఆశయాలను సాధించడంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిరంతరం నిమగ్నమై పనిచేస్తుందని రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన పొడిచేడులో శ్రీకాంత్ చారి 13 వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరుడైన శ్రీకాంత్ చారి బలిదానాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరోవబోరన్నారు. ప్రభుత్వం ఆయన ఆశయ సాధన దిశగా అనేక ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. శ్రీకాంత్ చారి కుటుంబానికి ప్రభుత్వం అండదండగా ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు&రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణ రెడ్డి, ,జెడ్పిచెర్మెన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, కాసోజు శంకరమ్మ స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నా రు.