ఫార్మా కంపనీపై చర్యలు తీసుకోండి: కుంభం అనిల్
విధాత: గ్రామాల్లో వాయు, జల కాలుష్యాలకు కారణం అవుతున్న ఫార్మా కంపెనీలపై చర్యలు తీసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన పోచంపల్లి మండలం దోతిగూడెంలో ఫార్మ కంపెనీ రసాయన వ్యర్ధాలతో గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులను పరిశీలించారు. గతంలోనూ కెమికల్ ఫ్యాక్టరీల కాలుష్యంపై ఆందోళన చేసినా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోక పోవడం విచారకరమన్నారు. పరిసర గ్రామాలు ఫార్మా కంపెనీల కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నార న్నారు. […]

విధాత: గ్రామాల్లో వాయు, జల కాలుష్యాలకు కారణం అవుతున్న ఫార్మా కంపెనీలపై చర్యలు తీసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన పోచంపల్లి మండలం దోతిగూడెంలో ఫార్మ కంపెనీ రసాయన వ్యర్ధాలతో గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులను పరిశీలించారు.
గతంలోనూ కెమికల్ ఫ్యాక్టరీల కాలుష్యంపై ఆందోళన చేసినా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోక పోవడం విచారకరమన్నారు. పరిసర గ్రామాలు ఫార్మా కంపెనీల కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నార న్నారు.
స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డితో పాటు జిల్లా అధికార యంత్రాంగం తక్షణమే ఈ సమస్యపై స్పందించి గ్రామస్తుల ఇబ్బందులు పరిష్కరించాలని లేని పక్షంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామన్నారు