తెలంగాణలో 87స్థానాల్లో టీడీపీ పోటీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 87స్థానాల్లో అభ్యర్థులను సిద్ధం చేసినట్లుగా టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ వెల్లడించారు.

తెలంగాణలో 87స్థానాల్లో టీడీపీ పోటీ

విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 87స్థానాల్లో అభ్యర్థులను సిద్ధం చేసినట్లుగా టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ వెల్లడించారు. హైద్రాబాద్‌ ఎన్టీఆర్‌ భవన్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాజమండ్రి జైలులో చంద్రబాబుతో ములాఖత్‌లో కలిసి మాట్లాడానని, రాష్ట్ర రాజకీయ పరిస్థితులను ఆయనకు వివరించానన్నారు.

జనసేనతో కలిసి ముందుకెళ్లే విషయమై ఇంకా స్పష్టత లేదని, తాము ప్రతిపాదించిన 87మంది అభ్యర్థుల జాబితాకు బాబు ఆమోదం లభించగానే అభ్యర్థుల పేర్లతో మ్యానిఫెస్టోను కూడా విడుదల చేస్తామన్నారు. కాగా చంద్రబాబు ఆరోగ్యంపై తమకు ఆందోళనకరంగా ఉందని, త్వరలోనే ఆయన జైలు నుంచి బయటకు వస్తారన్న ధీమా ఉందన్నారు. తెలంగాణ ఎన్నికల్లో పార్టీకి ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ ప్రచారం నిర్వహిస్తారని తెలిపారు.