ఆరాంఘర్‌-శంషాబాద్‌ రోడ్డుకు పూల‌సొగ‌సులు

అధికారులకు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆదేశంవిధాత‌: ఆరాంఘర్‌-శంషాబాద్‌ విమానాశ్రయం రోడ్డును పూల రహదారిగా మార్చాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన బీఆర్కేభవన్‌లో నేషనల్‌ హైవే అధారిటీ, రోడ్లు భవనాలశాఖ, జీహెచ్‌ఎంసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రోడ్లకు ఇరువైపులా, రోడ్డు మధ్యలో రంగు రంగుల పూలమొక్కలతో మల్టీ లేయర్‌ ఎవెన్యూప్లాంటేషన్‌ చేయాలన్నారు. విమానాశ్రయానికి వెళ్లే దారిలో బుద్వేల్‌ వద్ద సీఎస్‌ మొక్కలు నాటి, హరితహారం కార్యక్రమాన్ని పరిశీలించారు. సమావేశంలో రోడ్లు భవనాలశాఖ ప్రత్యేక ప్రధాన […]

ఆరాంఘర్‌-శంషాబాద్‌ రోడ్డుకు పూల‌సొగ‌సులు

అధికారులకు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆదేశం
విధాత‌: ఆరాంఘర్‌-శంషాబాద్‌ విమానాశ్రయం రోడ్డును పూల రహదారిగా మార్చాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన బీఆర్కేభవన్‌లో నేషనల్‌ హైవే అధారిటీ, రోడ్లు భవనాలశాఖ, జీహెచ్‌ఎంసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రోడ్లకు ఇరువైపులా, రోడ్డు మధ్యలో రంగు రంగుల పూలమొక్కలతో మల్టీ లేయర్‌ ఎవెన్యూప్లాంటేషన్‌ చేయాలన్నారు. విమానాశ్రయానికి వెళ్లే దారిలో బుద్వేల్‌ వద్ద సీఎస్‌ మొక్కలు నాటి, హరితహారం కార్యక్రమాన్ని పరిశీలించారు. సమావేశంలో రోడ్లు భవనాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.