ముస్లింల‌ను ఇబ్బంది పెడుతున్న బీజేపీకి మద్ద‌తుగా అస‌దుద్ధీన్‌: రేవంత్ రెడ్డి

ముస్లింల‌ను ఇబ్బంది పెడుతున్న బీజేపీకి మద్ద‌తుగా అస‌దుద్ధీన్‌: రేవంత్ రెడ్డి
  • రాజాసింగ్‌పై మ‌జ్లిస్ ఎందుకు పోటీ చేయ‌డంలేదు
  • మోడీ అమిత్ షా స‌న్నిహితుడికి త‌న ఇంట్లో పార్టీ ఇచ్చింది వాస్త‌వం కాదా
  • పార్టీ ఇవ్వ‌లేద‌ని ప్ర‌మాణం చేయ‌డానికి సిద్ద‌మా
  • అసదుద్దీన్ ఓవైసీకి రేవంత్ సవాల్

విధాత‌, హైద‌రాబాద్‌: ముస్లింల‌ను ఇబ్బంది పెడుతున్నబీజేపీకి మద్ద‌తుగా అస‌దుద్ధీన్ ఓవైసీ ఉంటున్నాడ‌ని పీసీసీ అధ్య‌క్షులు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం జూబ్లీహిల్స్‌లోని త‌న నివాసంలో మీడియాతో మాట్లాడుతూ గోషామ‌హ‌ల్‌లో రాజాసింగ్‌పై మ‌జ్లిస్ పార్టీ ఎందుకు పోటీ చేయ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. కేసీఆర్, మోదీ లాంటి దొంగలను కాపాడడానికి ఓవైసీ అబద్ధాలు చెపుతున్నాడన్నారు. అసదుద్దీన్ ఓవైసీ శర్వాణి లోపల పైజామా ఉందని అనుకున్నకానీ ఓవైసీ శర్వాణి కింద కాకీ నిక్కర్ ఉందని అర్థమైంద‌న్నారు. ముస్లిం హక్కుల కోసం కొట్లాడాలని అసదుద్దీన్ తండ్రి ఆయన్ని బారిష్టర్ చదివించాడన్నారు.


కానీ ఇందుకు విరుద్దంగా ముస్లింలను ఇబ్బంది పెడుతున్న బీజేపీకి అసదుద్దీన్ మద్దతుగా ఉంటున్నాడన్నారు. అసదుద్దీన్ ఓవైసీ కేసులు లాయర్ ఎవరు? అని ప్ర‌శ్నించారు. కర్ణాటక ఎన్నికల సమయంలో మోదీ, అమిత్ షా సన్నిహితుడికి తన ఇంట్లో పార్టీ ఓవైసీ పార్టీ ఇచ్చాడని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తాను పార్టీ ఇవ్వలేదని ప్రమాణం చేయడానికి ఓవైసీ సిద్దమా? అని అడిగారు. తాను హిందువుని, భాగ్యలక్ష్మి టెంపుల్ వెళ‌తాన‌ని అన్నారు. మీరు దర్గాకి రమ్మన్నా వస్తాను, భాగ్యలక్ష్మి టెంపుల్ రమ్మన్నా వస్తాను అని చెప్పారు. మక్కా మసీదులో ప్రమాణం చేయడానికి ఓవైసీ సిద్దమా? అని అన్నారు. శుక్రవారం నేను మక్కా మసీదు వస్తా. ఖురాన్ పట్టుకొని ప్రమాణం చేయడానికి ఓవైసీ సిద్దమా అని రేవంత్‌రెడ్డి స‌వాల్ విసిరారు.