వ్యాక్సినేషన్‌ను పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
విధాత(హైదరాబాద్): బొల్లారం కంటోన్మెంట్ ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. బొల్లారం కంటోన్మెంట్ ఆసుపత్రిని కోవిడ్ కేంద్రంగా మార్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు. ఊహించని కోవిడ్ ఉత్పాతం నుంచి బయటపడటానికి త్రివిధ దళాలు, పరమిలాటరీలో రిటైర్డ్ అయిన వైద్య సిబ్బందిని వినియోగించనున్నట్లు తెలిపారు. యువతకు 15 రోజులు శిక్షణ ఇచ్చి వారి సేవలను కోవిడ్ కోసం ఉపయోగించుకోనున్నట్లు వివరించారు. వైద్యవిద్యనభ్యశిస్తున్న వారందరి సేవలు ఉపయోగించుకుంటామని, భవిష్యత్తు ఉద్యోగ నియామకాల్లో […]

విధాత(హైదరాబాద్): బొల్లారం కంటోన్మెంట్ ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. బొల్లారం కంటోన్మెంట్ ఆసుపత్రిని కోవిడ్ కేంద్రంగా మార్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు.
ఊహించని కోవిడ్ ఉత్పాతం నుంచి బయటపడటానికి త్రివిధ దళాలు, పరమిలాటరీలో రిటైర్డ్ అయిన వైద్య సిబ్బందిని వినియోగించనున్నట్లు తెలిపారు. యువతకు 15 రోజులు శిక్షణ ఇచ్చి వారి సేవలను కోవిడ్ కోసం ఉపయోగించుకోనున్నట్లు వివరించారు. వైద్యవిద్యనభ్యశిస్తున్న వారందరి సేవలు ఉపయోగించుకుంటామని, భవిష్యత్తు ఉద్యోగ నియామకాల్లో సేవలందించిన వారికి వెయిటేజ్ ఇస్తామన్నారు.
దేశంలో 49 వేలు మాత్రమే ఉన్న వెంటిలేటర్స్‌ను, ఈ 9 నెలల్లో 51 వేలు అదనంగా తయారుచేసి వినియోగిస్తున్నట్లు వివరించారు. దేశంలోని ఆర్మీ ఆసుపత్రి, రైల్వే ఆసుపత్రి, aiims కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలోని అన్ని ఆసుపత్రులను ప్రజల కోసం కోవిడ్ ఆస్పత్రులుగా సేవలందిస్తున్నామని చెప్పారు.
నేడే డిఫెన్స్ మినిష్టర్ రాజ్‌నాథ్, డిఫెన్స్ సెక్రెటరితో మాట్లాడి నిధులు సమకూర్చి కంటోన్మెంట్ ఆసుపత్రిని కోవిడ్ ఆస్పత్రిగా మార్చి సేవలు అందేలా చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వీలైతే సేవ చేయండి సలహాలు ఇవ్వండి, కానీ పనిచేసే ప్రభుత్వంపై రాజకీయ విమర్శలు చేసి అడ్డంకులు సృష్టించొద్దని సూచించారు. ప్రజల సహకారం లేనిదే కోవిడ్ చైన్‌ను బ్రేక్ చేయలేమన్నారు.