ఓటమి భయంతోనే దేశం పేరు మార్పు: విహెచ్ విమర్శ

ఓడిపోతామనే భయంతోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాఠ్య పుస్తకాల్లో ఇండియా పేరు తీసేసి భారత్ అని పెడుతున్నారని సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు విమర్శించారు

ఓటమి భయంతోనే దేశం పేరు మార్పు: విహెచ్ విమర్శ

విధాత : ఓడిపోతామనే భయంతోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాఠ్య పుస్తకాల్లో ఇండియా పేరు తీసేసి భారత్ అని పెడుతున్నారని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు విమర్శించారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కేంద్రం వైఖరీని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా తెలిపారు. ప్రపంచంలో పేరున్న దేశం ఇండియా అని, ఓట్ల రాజకీయాలకు దేశం పేరును వాడుకోవడం దురుదృష్టకరమన్నారు.


కర్ణాటక సీఎం సిద్ధరామయ్య త్వరలో తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తారని, సిద్ధరామయ్య బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తారన్నారు. ఎన్నికల పేరుతో ఎక్కడ చూసినా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి సామాన్య మధ్యతరగతి ప్రజలని ఇబ్బందులు పెడుతున్నారన్నారు. నా రాజకీయ జీవితంలో ఇలాంటి ఎలక్షన్ కమిషన్ చూడలేదన్నారు.