ఎంపీ కొత్త ఆరోగ్య స్థితిపై యశోద వైద్యుల బులెటిన్

విధాత : కత్తిదాడిలో గాయపడి సికింద్రాబాద్ యశోధ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆరెస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై యశోద వైద్యులు మంగళవారం బులెటిన్ విడుదల చేశారు. ఎంపీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పలేమని, ప్రస్తుతం అందిస్తున్న ఐసీయూ చికిత్స ఐదు రోజులపాటు కొనసాగిస్తామన్నారు.
అయితే.. 15 రోజుల తర్వాత ఆపరేషన్ కుట్లు తీస్తామన్నారు. ఇది మేజర్ సర్జరీ అని రికవరీ కొంత సమయం పడుతుందన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డికి ఇన్ఫెక్షన్ లక్షణాలు ఉన్నాయన్నారు. ఎంపీ స్పృహలోనే ఉన్నారని, రికవరీ ప్రాసెస్ గురించి ఆయనకు వివరించినట్లు వైద్యులు తెలిపారు.