లక్ష కోట్ల కాళేశ్వరం గోదారి పాలు, నిధులు కల్వకుంట్ల వారి పాలు
లక్ష కోట్ల కాళేశ్వరం గోదారి పాలు - నిధులు కల్వకుంట్ల వారి పాలు అయ్యాయని వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు

- వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల
విధాత: “లక్ష కోట్ల కాళేశ్వరం నీళ్ళు గోదారి పాలు – నిధులు కల్వకుంట్ల వారి పాలు అయ్యాయని వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. ఈ మేరకు ఆమె ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. దొర గారి కమీషన్ల కక్కుర్తికి పంప్ హౌజ్ లే కాదు.ఏకంగా బరాజ్ లే కుంగుతున్నయన్నారు. ప్రాజెక్టు కట్టిన నాలుగేళ్లకే మేడిగడ్డ బ్యారేజీ కదిలిందంటే, మీ మెగా లోపమేంటో,మెగా దోపిడేంటో మరోసారి తేటతెల్లమైందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నాసిరకం అని చెప్పడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం మరోటి లేదన్నారు. లక్ష కోట్ల ప్రజా ధనాన్నికాజేశారనడానికి మేడిగడ్డ బ్యారేజీ కుంగడమే ఒక నిదర్శనమన్నారు. మీ అవినీతికి దర్పాలే కాళేశ్వరం లోపాలని ఆరోపించారు.
తప్పులు కప్పి పుచ్చడానికి కుట్ర కోణం అని డ్రామాలు మొదలు పెట్టినా,ప్రాజెక్ట్ చుట్టూ పోలీసులను పెట్టి నిజాలు దాచిపెట్టినా, జరిగిన నష్టాన్ని బయటకు పొక్కకుండా నోర్లు మూయించినా, మీ మానస పుత్రిక కాళేశ్వరం అంతా బోగస్ అని ఆధారాలతో తెలంగాణ సమాజానికి అర్థమైందన్నారు.