ఢిల్లీ లిక్కర్ స్కామ్: హైదరాబాద్‌లో మరోసారి 25 బృందాలతో ఈడీ సోదాలు
విధాత: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ మరోసారి సోదాలు చేస్తున్నది. రాయదుర్గం సహా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఢిల్లీకి చెందిన ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. 25 బృందాలుగా ఏర్పడి ఈడీ సోదాలు చేస్తున్నది. లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే హైదరాబాద్‌లో రెండుసార్లు సోదాలు నిర్వహించింది. ఢిల్లీకి చెందిన ఈడీ అధికారుల ఆధ్వర్యంలో 25 బృందాలుగా ఏర్పడి హైదరాబాద్‌లో తనిఖీలు చేస్తున్నారు. కోకాపేట్‌లోని రామచంద్ర పిళ్లై నివాసంతో పాటు ఆయనకు సంబంధించి వ్యాపార భాగస్వాములుగా ఉన్నవాళ్ల […]

విధాత: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ మరోసారి సోదాలు చేస్తున్నది. రాయదుర్గం సహా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఢిల్లీకి చెందిన ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. 25 బృందాలుగా ఏర్పడి ఈడీ సోదాలు చేస్తున్నది. లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే హైదరాబాద్‌లో రెండుసార్లు సోదాలు నిర్వహించింది.
ఢిల్లీకి చెందిన ఈడీ అధికారుల ఆధ్వర్యంలో 25 బృందాలుగా ఏర్పడి హైదరాబాద్‌లో తనిఖీలు చేస్తున్నారు. కోకాపేట్‌లోని రామచంద్ర పిళ్లై నివాసంతో పాటు ఆయనకు సంబంధించి వ్యాపార భాగస్వాములుగా ఉన్నవాళ్ల ఇళ్లలోనూ నివాసంలో ఈడీ గతంలో సోదాలు చేసింది. పిళ్లై అభిషేక్ బోయిన్‌పల్లిని భాగస్వామిగా చేర్చుకుని అతని ద్వారా లావాదేవీలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
పిళ్లై అభిషేక్‌ను, గండ్ర ప్రేమ్‌సాగర్ రావులను డైరెక్టర్లుగా నియమించుకున్నారు. ఈ సందర్భంగా కొన్ని డ్యాక్యుమెంట్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలో లిక్కర్‌కు స్కామ్‌కు సంబంధించి ఈడీ అధికారులు నమోదు చేసిన కేసు ఆధారంగా మనీలాండరింగ్ చట్టం కింద తనిఖీలు చేస్తున్నారు.
ఇప్పటికే కీలక పత్రాలు నమోదు చేసుకుంటున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఈరోజులు కూడా తనిఖీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ తనిఖీలకు సంబంధించి ఈడీ అధికారులు అధికారికంగా సమాచారం ఇవ్వలేదు.