బీజేపీలోకి డిప్యూటీ స్పీకర్ పద్మారావు.. నిజమెంత!
ఉన్నమాట: మునుగోడు ఉప ఎన్నిక వేళ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. దీనికితోడు నివురుగప్పిన నిప్పులా ఉన్న అధికార పార్టీలోని అసంతృప్తులు కమలం పార్టీ వైపు చూస్తున్నారు. అవకాశం దొరికితే కారు దిగి కాషాయ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధపడుతున్నారని, మాజీ ఎంపీ బూర నర్సయ్య బీజేపీలో చేరుతారన్న సమయంలోనే మరో ఎమ్మెల్యే కూడా కారు దిగుతారనే ప్రచారమూ జరిగింది. అయితే ఆ ఎమ్మెల్యే ఎవరు […]

ఉన్నమాట: మునుగోడు ఉప ఎన్నిక వేళ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. దీనికితోడు నివురుగప్పిన నిప్పులా ఉన్న అధికార పార్టీలోని అసంతృప్తులు కమలం పార్టీ వైపు చూస్తున్నారు. అవకాశం దొరికితే కారు దిగి కాషాయ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధపడుతున్నారని, మాజీ ఎంపీ బూర నర్సయ్య బీజేపీలో చేరుతారన్న సమయంలోనే మరో ఎమ్మెల్యే కూడా కారు దిగుతారనే ప్రచారమూ జరిగింది. అయితే ఆ ఎమ్మెల్యే ఎవరు అన్న చర్చ జరిగింది.
బూర నర్సయ్యతో పాటు కర్నె ప్రభాకర్ కూడా బీజేపీలో చేరబోతున్నారు ప్రధాన మీడియాలో, సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆయన హస్తినలో ఉన్నారు అనేక కథనాలు వెలువడ్డాయి. అయితే పల్లె రవికుమార్ దంపతులు మంత్రి కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ కండువా కప్పుకున్న సమయంలో కర్నె ప్రభాకర్ దర్శనమిచ్చి తనపై వస్తున్న కథనాలకు చెక్ పెట్టారు.
తాజాగా డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో సమావేశమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నది. కొంతకాలంగా టీఆర్ఎస్ అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్నారని.. పద్మారావు గౌడ్ కూడా పార్టీ వీడుతారని ఆ వీడియోను షేర్ చేస్తూ ప్రచారం చేస్తున్నారు. అయితే దీనిపై స్పందించిన డిప్యూటీ స్పీకర్ తాను పార్టీ వీడటం లేదని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చిందట.
అయితే ఎన్నికల సందర్భంలో బీజేపీ చేసే అసత్య ప్రచారంలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయని, ఆ పార్టీ అగ్రనేత అమిత్ షా చెప్పినట్టు అధికారం కోసం అవసరమైనతే అసత్యాలనైనా ప్రచారం చేయాలన్న మాటలను రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఆచరణలో పెట్టిందని టీఆర్‌ఎస్ ఆరోపించింది. ఈ క్రమంలోనే బూర నర్సయ్యతో పాటు కర్నె ప్రభాకర్ కూడా చేరుతారని ఇలాగే ప్రచారం చేశారు.
అయితే ఆయన పార్టీ వీడటం లేదని 24 గంటల్లోనే ఇదంతా బీజేపీ చేస్తున్నఅసత్య ప్రచారమని తర్వాత తేటతెల్లమైంది. దీంతో ఖంగుతిన్న బీజేపీ నేతలు ఓటర్లను కన్ఫ్యూజన్ చేయడానికి ఇప్పుడు డిప్యూటీ స్వీకర్ పద్మారావును తెరమీదికి తెచ్చారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్ప నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నది. కేంద్రమంత్రితో ఏదో సందర్భంలో ఆయన సమావేశమైన ఫొటోలను, వీడియోను వాళ్లకు అనుగుణంగా ఎడిట్ చేసుకుని వాట్సప్ యూనివర్సిటీ ద్వారా వైరల్ చేస్తున్నారు. ఇవే కాదు ఇలాంటి ప్రచారాలు ఉప ఎన్నిక ముగిసేలోగా మరిన్ని వస్తాయని భావిస్తున్నారు.
బీజేపీ ఎన్నికల సమయంలో ఎప్పుడూ తాను చేసిన అభివృద్ధి పనుల గురించి చెప్పుకోదు. మతం పేరుతోనో, అసత్య ప్రచారాలతోనో, మార్ఫింగ్ వీడియోలతోనో, పోటీ చేసే అభ్యర్థి కాలుకో, చేతికో దెబ్బ తగలినట్టు కథనాలు సృష్టిస్తారు. భావోద్వేగాలను రెచ్చగొట్టడమే వారి పని. వాటిని సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా షేర్ చేస్తారు. ఇవన్నీ దుబ్బాక నుంచి మొదలు హుజురాబాద్ ఉప ఎన్నిక వరకు రాష్ట్ర ప్రజల అనుభవంలో ఉన్నవే.
నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న బీజేపీ నేతలకు దుబ్బాక, హుజురాబాద్‌లో గెలిపిస్తే ఏం చేశారు? కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారు అనే ప్రశ్నలు ప్రజల నుంచి ఎదురవుతున్నాయి. దీంతో ఏ విషయం లేని బీజేపీ నేతలు అధికార పార్టీ నేతలు పార్టీ వీడుతున్నారనే కట్టుకథలతో వీడియోలు పెడుతూ అబద్ధాలను ప్రచారంలో పెట్టారు. అంతేకాదు కేటీఆర్, హరీశ్ రావుల మధ్య వైరం పెరిగిందంటారు. హరీశ్ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని, ఆయనతో పాటు చాలామంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌ను వీడుతారనే విష ప్రచారం కూడా చేయడానికి వెనుకాడరు. – రాజు ఆసరి