ఈరోజు700 మంది ఖైదీల విడుదల: సీఎం స్టాలిన్

విధాత‌: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి సిఎన్‌.అన్నాదురై జయంతి సందర్భంగా ఈరోజు(బుధవారం) రాష్ట్రవ్యాప్తంగా జైళ్లలో జీవిత ఖైదు అనుభవిస్తున్న 700 మంది ఖైదీలను విడుదల చేస్తామని ఆ రాష్ట్ర సిఎం ఎంకె.స్టాలిన్‌ సోమవారం నాడు అసెంబ్లీలో ప్రకటించారు.పోలీస్‌ శాఖలో గ్రాంట్ల డిమాండుకు సంబంధించి జరిగిన చర్చకు ఆయన సమాధానం ఇస్తూ 700 మంది జీవిత ఖైదీల శిక్షను తగ్గించేందుకు, సత్ప్రవర్తనను పరిగణనలోకి తీసుకొని మానవతా కోణంలో వారిని ముందస్తుగా విడుదల చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. […]

ఈరోజు700 మంది ఖైదీల విడుదల: సీఎం స్టాలిన్

విధాత‌: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి సిఎన్‌.అన్నాదురై జయంతి సందర్భంగా ఈరోజు(బుధవారం) రాష్ట్రవ్యాప్తంగా జైళ్లలో జీవిత ఖైదు అనుభవిస్తున్న 700 మంది ఖైదీలను విడుదల చేస్తామని ఆ రాష్ట్ర సిఎం ఎంకె.స్టాలిన్‌ సోమవారం నాడు అసెంబ్లీలో ప్రకటించారు.
పోలీస్‌ శాఖలో గ్రాంట్ల డిమాండుకు సంబంధించి జరిగిన చర్చకు ఆయన సమాధానం ఇస్తూ 700 మంది జీవిత ఖైదీల శిక్షను తగ్గించేందుకు, సత్ప్రవర్తనను పరిగణనలోకి తీసుకొని మానవతా కోణంలో వారిని ముందస్తుగా విడుదల చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులను విడుదల చేస్తామని వెల్లడించారు.